ఎవరు నీవని అడగకు…
కృష్ణశాస్త్రి గారి కవితలో
అలతి పదాన్ని నేను…
చలం గారి మాటలో
వ్యoగ్యాన్ని నేను…
శ్రీశ్రీ గారి పాటలో
అభ్యుదయాన్ని నేను…
తిలక్ గారి వెన్నెల్లో
ఆడపిల్లను నేను…
శరత్ గారి
చంద్రికను నేను…
నండూరి గారి
ఎంకి వయ్యారాన్ని నేను…
కృష్ణదేవరాయల వారి ఆముక్తమాల్యదలో
చిలిపితనాన్ని నేను…
స్వప్నవిహారి వారి
కవనంలో
వెన్నెల్లో ఆడపిల్ల
ఆలోచనను నేనే…
ఎవరునీవంటే ఏంచెప్పాలి
అనురాగా న్ని నేనే…
ఆప్యాతను నేనే…
నిజమైన ప్రేమను నేనే…
స్వచ్ఛమైన ఆరాధనను నేనే…
అన్నీ నేనే
అన్నింటా నేనే …!
– గత్తం వెంకటేశ్వరరావు