గద్దర్ కు సప్తపదులు
BY Telugu Global7 Aug 2023 12:55 PM IST
X
Telugu Global Updated On: 7 Aug 2023 12:55 PM IST
గళం
కలం
గద్దర్ గర్జనే దళిత దళం బలం
-డా చిట్యాల రవీందర్
హైదరాబాద్
xxxxxx
మాట
పాట
ఒకటికొకటి తోడయి గెలిచింది గద్దర్ ఆట
-కళ్ళే వెంకటేశ్వర శాస్త్రి
బెంగళూరు
xxxxx
స్వరం
సుస్వరం
గద్దర్ అన్యాయంపై భగభగ మండిన భాస్వరం
-కే. వరలక్ష్మీదేవి
కర్నూలు
xxxxx
పెట్టుమచ్చ
పుట్టుమచ్చ
గద్దర్ పురోగమనం ఒక రచ్చ రచ్చ
- విశాలరెడ్డి
నిజామాబాద్
xxxxx
ఎరుపు
మెరుపు
గద్దర్ గళం సమాజాన్ని మార్చగల చరుపు
- భీమ్లా రౌత్
నాగపూర్
xxxxxx
కలం
గళం
పీడిత తాడిత జననాడికి గద్దర్ బలం
-వై. పద్మ.
కొత్తగూడెం
xxxxx
మాటా
పాటా
విశ్రమించిన గద్దర్ అన్యాయంపై పేల్చిన తూటా.
శాంతమూర్తి
హైదరాబాద్
xxxxxxx
Next Story