సాంస్కృతిక సారథి చైర్‌పర్సన్ గా గద్దర్ బిడ్డ వెన్నెల
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్ పర్సన్ గా గద్దర్ కుమార్తె డాక్టర్ గుమ్మడి వి. వెన్నెలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వెన్నెలకు కంట్మోనెంట్ నుంచి కాంగ్రెస్ టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో గెలిచిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణం తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో వెన్నెలకు అవకాశం ఇవ్వకుండా బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన శ్రీగణేశ్ కు టికెట్ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతిష్టాత్మక కార్యక్రమాలు, అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సాంస్కృతిక సారథి కళాకారులతో ప్రచారం చేయిస్తారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ సంస్థను ఏర్పాటు చేశారు. అప్పడు చైర్మన్ గా ఉన్న అప్పటి మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కు కేబినెట్ హోదా కల్పించారు. గద్దర్ కుమార్తెను చైర్ పర్సన్ గా నియమించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆమెకు కేబినెట్ హోదా ఇవ్వలేదు.