Telugu Global
Arts & Literature

ప్రపంచీకరణలో మహిళాభివృద్ధి (వ్యాసం)

ప్రపంచీకరణలో మహిళాభివృద్ధి  (వ్యాసం)
X

ప్రపంచంలోని దేశాలన్నీ ఆర్థిక సాంఘిక సామాజిక సాంస్కృతిక రంగాలలో వస్తున్న మార్పులని స్వాగతించి అంతర్జాతీయ సమైక్యతా భావనతో ప్రపంచమంతా ఒకే కుటుంబంగా పరిఢవిల్లుటేప్రపంచీకరణ.

ఈ ప్రపంచీకరణ ప్రభావంతో శరవేగంగా వస్తున్న పెను మార్పులను తట్టుకునేందుకు సమాజంలోని అన్ని వర్గాల వారు సంసిద్ధులుగా ఉండక తప్పదు తమదైన ఆలోచనలను పెట్టుబడిగా పెట్టి స్వదేశాలలోనూ విదేశాలలోనూ అతి అతి తక్కువ సమయంలో డబ్బు పేరు సంపాదించే వారికి ఈ ప్రపంచీకరణ తోడ్పడుతుంది అంటే ఇది ఉన్నత వర్గాల వారిని మరింత ఉన్నత స్థితికి తీసుకువెళ్లి అట్టడుగు వర్గాల వారిని మరింతగా అణచివేస్తుందని అపోహ ఉన్నప్పటికీ ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రత్యేక లక్షణాలున్న ఏ వర్గపు నేపథ్యంలో నింగికి దూసుకుపోతున్నారంటంలో సందేహం లేదు వాటి ఉదాహరణగా గ్రామీణ ప్రాంతంలోని పిల్లలు కూడా

శ్రమ పడితే ఐటీరంగంలో అద్భుతాలు సృష్టించడమే.

ప్రపంచీకరణలో మహిళాభివృధ్ధి

-----------------------

ప్రపంచీకరణ నేపథ్యంలో మహిళల పట్ల గల వివక్షత వల్ల వీరు ఈ రంగంలో గల వేగాన్నిఅందుకోలేకపోతున్నారన్న ఆరోపణ ఉన్నప్పటికీ ప్రపంచీకరణ స్త్రీ స్వాతంత్రాన్ని పెంచిందని చెప్పాలి. నేడు ఉద్యోగ రంగంలో మహిళల ప్రాధాన్యత పెరిగింది దీనివల్ల స్త్రీల మీద ఉన్న సామాజిక ఆంక్షలు తొలగిపోయాయి. పురుషుడితోసమానముగా అదే వివేక స్థాయిలో ఉన్న మహిళ విదేశాలలో సైతం మగవారితో సమానంగా ఉద్యోగ అవకాశాలుపొందుతోంది

ఏ రంగంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉన్నాయో పసిగట్టి ఆ రంగాన్నిఅందుకోవడంలో మహిళలేముందంజ

వేయడం ముదావహం.

ప్రభుత్వం అందిస్తున్న సహాయసహకారాలు ,

మహిళలకు అనుకూలంగా చేసిన చట్టాలు ప్రవేశపెట్టబడిన మహిళా రిజర్వేషన్ చట్టం మహిళలకు మేలు

చేసాయనడములో సందేహం లేదు. దానివల్ల నేడు అన్ని రంగాలలో స్త్రీలు కీలకస్ధానాల్లో కనిపిస్తున్నారు

ఫ్రాన్స్ లోని"దవెల్లీ"లో జరిగిన'గ్లోబల్ ఉమెన్స్ ఫోరం'లో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి.


అవేమిటంటే ప్రపంచీకరణ నేపధ్యం లో దేశ విదేశాల్లోని మహిళలు ప్రభుత్వ ప్రైవేటు రంగాలలో తమ ప్రతిభను చూపిస్తున్నారని వెల్లడి చేసింది. అలాగే వ్యాపార రంగంలో కూడా అనేక అవకాశాలను అందిపుచ్చుకున్న

మహిళలున్నారని

ఆ సంఘ నివేదిక తెలియజేసింది.

ఈ ప్రపంచీకరణ అందజేస్తున్న అవకాశాలను అభివృద్ధి చెందిన దేశాల మహిళల కన్నా అభివృద్ధి చెందుతున్న దేశాల మహిళలే ఎక్కువగా అందిపుచ్చుకుని మేలు పొందుతున్నారని గ్లోబల్ ఉమెన్ ఫోరమ్ తెలిపింది .అందులో ముఖ్యంగా భారతీయ మహిళల జోరు అధికంగా ఉందనుటలో సందేహం లేదు. దీనికి కారణం ఈ దేశంలో గల సుస్థిర కుటుంబ వ్యవస్థ ,కుటుంబ సభ్యులు అందించే సహాయ సహకారాలు నైతిక మద్దతు ఈ దేశ మహిళల అభివృద్ధికి మూలమయ్యింది.

వంటల తయారీ పూల తోటల పెంపకం పండ్ల వ్యాపారం నుంచి పెద్ద పెద్ద పరిశ్రమలనైనా సమర్థవంతంగా నిర్వహించే సత్తా భారతదేశమహిళ లేకే ఉన్నదన్నది నిర్వివాదాంశం

అలాగే భారతదేశం మహిళల కి ఇచ్చినంత స్వేచ్ఛను మరి ఏ ఇతర దేశం ఇవ్వలేదని గ్లోబల్ ఫారంతేల్చేసింది .భారతదేశంలో రాజకీయ వ్యాపార సాహిత్య విజ్ఞాన శాస్త్రాలలో మహిళల నాయకత్వం తిరుగులేనిది వీరిసంఖ్య తక్కువ అయినప్పటికీ అంతర్జాతీయఖ్యాతి గడించినవనితలెందరో ఉన్నా 1960లో ఇందిరా గాంధీ తొలి మహిళా ప్రధానమంత్రిగా రాజ్యమేలుట అలాగే ఉత్తరప్రదేశ్ ,తమిళనాడులో మహిళా ముఖ్యమంత్రి పరిపాలన సాగించుట 2010లోభారతరాజ్యా

అధినేత్రిగా ప్రతిభాపాటిల్, పార్లమెంట్ అధ్యక్షురాలిగా

మీరాకుమార్ మొదలైనమహిళలు

పలురాజకీయపార్టీలకుమహిళాఅధ్యక్షురాళ్ళుగా అంతర్జాతీయ కీర్తిగడించారు.ప్రస్తుత భారత అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము కూడా ఎదిగివచ్చిన స్త్రీయే !

బయోటెక్ రంగంలో కిరణ్ మజుందార్,HTVమీడియాలో శోభా భారతి మున్నగు స్త్రీ లు గుర్తింపు పొందారు.అలాగే వ్యాపార రంగాల్లో కూడా స్త్రీలువారికున్న నిజాయతీ, సమస్య పరిష్కారాలలో వారుతీసుకుంటున్న

నిర్ణయాలు,సహనంతో సాగే వారిపర్యవేక్షణ వారిని ఆరంగంలో ప్రధమస్ధానంలో నిలిపింది.

ఇతరులకు స్ఫూర్తినిచ్చే మహిళలుగా, రోల్ మోడల్స్ గా నిలిచేవారిలోకిరణ్ బేడీ,మేథాపాట్కర్ ,మాయావతి ముఖ్యులు.

ఏ రంగంలోనైనా నీతిగా,నిజాయితీగా విధులను నిర్వహించడంలో

మహిళలు సమర్ధులు కనుకే మన దేశం రాజకీయాల్లో వీరికి 33శాతం సీట్లు రిజర్వ్ చేయబూనడం

ముదావహం.ఆ రిజర్వేషన్ గానీ కచ్చితంగా అమలు జరిగితే భారత

మహిళ విశ్వంలో తన విశ్వరూపం

ప్రదర్శన చూపిస్తుందనుటలో సందేహం లేదు.

మహిళా ఓ మహిళా !

ఆకాశంలో సగం నీవు

అంతరిక్షంలో సగం నీవు

ఇక రాజ్యాంగం లో కూడా

సగంనీవే.!!

- కూరెళ్ళ సత్యవతి

First Published:  13 March 2023 1:19 PM IST
Next Story