ఎలక్షన్ సప్తపదులు
1
ఓటు
కాటు
బాధ్యత ఎరిగి వెయ్యకపోతే భవితంతా చేటు
-భాగవతులకృష్ణారావు
సికింద్రాబాద్
2
ఓట్లు
నోట్లు
పంచి వేసాక రాజకీయనాయకులు పెడతారు తూట్లు!
-డాక్టర్ గన్నోజు శ్రీనివాసాచార్య
మహబూబ్ నగర్.
3
నోటు,
కాటు,
ఎన్నికలప్పుడు పంచుతూ వాగ్దానాలతో పదవికోసం మాటు.
మేము విజయ్ కుమార్.
మనుబోలు, నెల్లూరు జిల్లా
4
ఆహో
ఓహో
ఈతీరుగా సాగితే జనం
పలుకును సాహో!
-యన్.కే. నాగేశ్వరరావు,
పెనుగొండ.
5
నోట్లు,
ఓట్లు
కక్కుర్తిపడితే పడాలి అయిదేళ్ళు రకరకాల పాట్లు
వి శ్రీనివాస మూర్తి
హైదరాబాదు
6
బూతులు
కూతలు
కూసిన నాయకులకు ఓట్లతో పెడతారు వాతలు.
క్రొవ్విడి వెంకట బలరామమూర్తి
హైదరాబాద్.
7
పండుగ
మెండుగ
ప్రజాస్వామ్యోత్సవములో మనమందరమూ భాగస్వాములమై ఓటేద్దాము నిండుగ
-కాళీపట్నపు శారద
హైదరాబాదు
8
ఓటు
నోటు
వైరిసమాసం కావాలి ద్వంద్వమైతే ప్రజాస్వామ్యానికే వెన్నుపోటు
-సూర్యదేవర రవికుమార్
గుంటూరు
9
మాతరం మీతరం ఏతరం వారైనా మనదేశంలో నినదించాల్సిందే.. వందేమాతరం.
- చెన్నూరి సుదర్శన్,
హైద్రాబాదు
10
శిక్షించు
భక్షించు
నాయకుల పీడననుండి చైతన్య ఓటరే రక్షించు
-కరకవలస భాస్కరరాజు
సింహాచలం,విశాఖపట్నం
11
కోటా
వాటా
దేశాన్ని ఉద్ధరించటానికి(?)
నేతలను తూస్తుంది ఎన్నికలకాటా!
గోగినేని రత్నాకరరావు
తెనాలి
12
కదలండి
వెళ్ళండి
అమూల్యమైన ఓటును పోలింగ్
కేంద్రoలో వేయండి.
-గుండం మోహన్ రెడ్డి
నర్సాపూర్,మెదక్.
వివిధ కవులు