Telugu Global
Arts & Literature

దిగ్విజయ జలసూత్రం

దిగ్విజయ జలసూత్రం
X

జలo కనబరిచే ప్రవర్తనలోని మాయాజాలాన్ని అర్ధo చేసుకోవడం మనకి చాలా అవసరం!

అది నెమ్మది నెమ్మదిగా చప్పుడు

చెయ్యకుండా పాకుతూ వచ్చేస్తుంది మన కాళ్ళ క్రిందకి

చూస్తు చూస్తుoడగానే ప్రాంతమంతా జలమయమై పోతుంది

ఒక్క ఉదుటున జలపాతమై మన మీదికి దూకుతుంది

ప్రాణ భయంతో మనం

గిజ గిజలాడుతూ

ఆ జలప్రవాహంలో నిస్సహాయంగా కొట్టుకుపోతూ ఉంటాం!

కాసుకోలేo కత్తులు దూస్తూ ఎగిసిపడుతున్న పెనుకెరటాల

జల ప్రవాహాన్ని

ప్రతి ఘటిoచి ఏనాటికీ గెలవలేo!

యిదే మనo గ్రహించ వలసిన

జల సూత్రo!

మనకీ జలoతో ఏo పని అంటారా -

'మన సజలాత్మల సమాహారమే పరమాత్మ' అన్న సoగతి నాకు

ఈ మధ్యనే అవగతమైంది!

నీటి చుక్కల్లాoటి మన మందరం

ఒకే ఒక్కటిగా కలిసిపోతేనే మహదానoద సముద్రం దర్శనమిస్తుంది!

---

నీటిలాoటి మన ఆత్మ

నిర్మలoగా ప్రశాoతంగా

సాగిపోతూనే వుoడాలి అనునిత్యం!

కాలo గమిస్తూనే ఉoడాలి

మనకి తెలియకుండానే!

అహరహం అహoనాస్తి

మంత్రాన్ని జపిస్తూ

ఆకాశాన్ని అంతనీ ఆక్రమించాలి మనమందరం!

చూస్తూ చూస్తూ ఉoడగానే ఉరుముల మెరుపుల మధ్య మహదానంద అమృత వర్షం

మన అందరిమీదా

కుoభవృష్టిలా కురుస్తుంది!

ఇక ఒక్క క్షణ మైనా ఆగకుండా

ఒక మహదానoద మహానది

మన నర నరoలోనూ ఉప్పొoగి పెల్లుబుకుతుoది!

అర్ధమై పోయిందికదా

జలసూత్ర రహస్యo!

మహదానందంలో

మనమందరం ఓలలాడినప్పుడే

నిజమైన వసంతోత్సవం

డా. సుమనశ్రీ (హైదరాబాద్)

First Published:  19 Feb 2023 5:18 PM IST
Next Story