Telugu Global
Arts & Literature

కలికి తురాయి (చిట్టి కవిత)

కలికి తురాయి (చిట్టి  కవిత)
X

గుండ్రంగా

బంతుల్లా వుంటాయనేమో

ఆ అందాల పూలకి

'బంతిపూలు' అనే పేరొచ్చింది!

కొత్త వత్సరం కోసమే అన్నట్టు

సంక్రాంతి కి కసింత ముందుగానే

పూస్తాయి!

అందుబాటుకొస్తాయి

కళకళ్లాడుతూ గుమ్మాలకి తోరణాలవుతాయి!

గొబ్బెమ్మలకి కిరీటాలౌతాయి

పల్లె పడుచుల వాలుజడలో హొయలు పోతాయి

ఇంతులు పూబంతుల గుచ్చే దృశ్యం

'నభూతో నభవిష్యతి 'కదా!

పూలదండలల్లడంలో కూతురుకి తల్లే గురువు!

నాటికైనా నేటికైనా విరిసిన బంతిపూవే

పూల కిరీటానికి కలికి తురాయి !

-డాక్టర్ మానుకొండ

సూర్య కుమారి, (విశాఖ పట్టణం)

First Published:  11 Feb 2023 5:03 PM IST
Next Story