మారిపోతున్నాడుసుమా
మనిషి …..!
కాదు ..కాదు ..
మారిపోయాడు సుమా,
మనిషి …..!
స్వార్ధమే –
సర్వస్వమనుకుని ,
ధనార్జనే …
జీవితధ్యేయమనుకుని
గిరిగీసుకుంటున్నాడు
మనిషి….!
తనకుతాను
వంటరైపోతున్నాడు
మనిషి …..!
బంధుత్వాలు….
రక్తసంబంధాలు…
అనురాగాలు–
ఆప్యాయతలు…
వాణిజ్య సంబంధాలుగా
మార్చి వేస్తున్నాడు
మనిషి….సర్వం,
డబ్బుకే ముడిపెడుతున్నాడు
మనిషి ……..!
సుఖాలమాటున
కష్టపడడం మాని,
కష్టపడటం వెనుక
సుఖమున్నదని మరచి
మారిపోయాడు సుమా
మనిషి ….!
మారిపోతున్నాడు సుమా
మనిషి …!!
-డా.కె.ఎల్.వి.ప్రసాద్.
(హన్మకొండ)