దేశ భక్తి యే - దేవ దేవుని భక్తి
పసితనంలో పిల్లల లేత మనసులలో
దేశభక్తి బీజములు నాటవలసిన అవసరం ఎంతయినా వుంది..
బాహ్య ప్రపంచంలో అన్ని విధాలైన అల్ప ప్రవృత్తులను అసత్యపు
విలువలను అనుక్షణం ప్రతిఘటించ
వలసిన ఆవశ్యకత ఈ నాటి ఆధునిక
యుగంలో ప్రతి ఒక్కరు బాధ్యతగా
తీసుకోవలసిన అవసరం వుంది.
ధర్మ, వీర, వివేక మార్గాల వైపు పయనించాలి .జన సేవయే జనార్ధన సేవ .దేశభక్తి దేవదేవుని
భక్తిని -అందరూ విశ్వసించాలి
ఇటీవల కాలంలోప్రపంచవ్యాప్తంగా
ఎన్నో రాజకీయ సామాజిక, సాంస్కృతిక
పరిణామాలు సంభవిస్తున్నాయి. వీటికి కారణాలు ఆధ్యాత్మిక చింతన
లోపము అని చెప్పవచ్చు
బహు భాషా దేశమైన మన భారత దేశంలో తెలుగు భాష, సాహిత్యo ,
సంగీత, చరిత్ర, సంస్కృతి కళలు మొదలగునవి ప్రపంచీకరణ
నేపథ్యంలో వాటి ఉనికి ఔన్నత్యాలు
పరిరక్షించు కోవాలి
తెలుగు వారి సంస్కతి బహుముఖీనమైనది అందులో
లలితకళలు, జానపద, గిరిజన విజ్ఞానం
ఎన్నో అంశాలుఇమిడి వున్నా యి.
ఘన చరిత్ర, అత్యన్నత సంస్కృతి
కాలంతో పాటు మార్పు చెందుతూ అభివృద్ధి పథంవైపు పరుగులు తీయాలి . కొత్త నీరును ఆహ్వానించాలి
పాత కొత్తల మేలుకలయికయే
నిత్య చైతన్యం తీసుకురావడానికి దోహదం అవుతుంది
ఇతిహాసాలు, భారత, భాగవత, రామాయణ ఉపనిషత్తులు మొ॥
దినచర్యలో యువతకు భాగమైనప్పుడు, చెడు ఆలోచనలకు ,చేష్టలకు అవకాశం తక్కువ.
రామాయణం రాముని దివ్యచరితం. ఘనశీలవతి కధలు- శ్లోకాలు పఠించినా
సన్మార్గములోనికి పయనించవచ్చు
ఒక్క అక్షరమైనా సరే మనసుఉంచి
పఠి స్తే (లేదా ) చదవాలని అనుకున్నా చాలు వినాలని వింటే - తలచినా చాలు ప్రతి అక్షరము మహా పాతక నాశనమవుతుంది .ఇది
భారతీయుల విశ్వాసం కూడా
ఆద్యాత్మికరామాయణం :
జానపద శైలిలో రామాయణ భావాలను గేయాత్మకoగా, సంకీర్తనాపరంగా గానము చేసేవారు. ప్రతి ఇంట్లో సుస్వర- నాదం వినిపిస్తువుండేది.
వివిధ వాగ్గేయకారుల రచనలు పరిశీలిస్తే
మనకొక విషయం అర్థం అవుతుందీ
ఇష్ట దైవాలను స్తుతిస్తూ - రచించినవి కొన్ని వారిపేరుతో ముద్ర - నామాలు కల్గినవికొన్ని .సామాజిక కీర్తనలు కొన్నీ, నీతి బోధకాలు కొన్ని .ఆధ్యాత్మికాలు కొన్ని .ఇలా ఎన్నో రకాల అపూర్వ సంగీత నిధిని వాగ్గేయ కారులు మనకి అందించారు
భారతీయ సంస్కృ తికి వేదం ఆధారం.
"పాఠ్యయే గేయేచ మధురం "అని
వాల్మీకి స్వయంగా - చెప్పారు.
అంటే ధాతువులతో మాధుర్యము అన్న మాట.వాక్కుకు మాతువని, గేయానికి ధాతువు అని సంజ్ఞలు . ఆ రెండు చేసేవాడు వాగ్గేయకారుడు. ఆ రకంగా వాల్మీకి ఆదికవి, ఆది వాగ్గేయకారుడు - నేడు వాల్మీకానికి పాఠ్యo గానే
ప్రచారం ఉంది. గేయంగా లేదు దురదృష్టవశాత్తు దాని గేయ సంప్రదాయం అంతరించి పాఠ్యoగా
నిలిచి ఉంటోo ది. కాని బాలకాండ
4 వసర్గ చదివేటప్పుడు పాఠ్యత కంటే
గేయతకే ప్రాముఖ్యం ఇచ్చారా అని పిస్తుంది.
మన గాన సంప్రదాయంఎన్నెన్నో పరిణామాలు చెందింది .మార్గ, దేశ విభేదాలు ఉన్నట్లు తోస్తుంది.
అని పిస్తుంది.
రంగనాథరామాయణం,కంబ రామాయణం(తమిళంలో) - వంగ భాషలో 'కృత్తి వాసుఓఝా'రామాయణం
మాత్రా ఛందస్సులో పాదాంత్య
ప్రాస నియమంతో నడిచిన గేయమే.
తరువాత తులసిదాసుని 'రామ చరిత మానస్ '( 16వ శ ) ; ఎళు తచ్చన్
ఆధునిక మళయాళ భాషకు -
పితామహుడు రచించిన
రామాయణం గణిoపదగినది.
కుమార వాల్మీకి కన్నడ భాషలో
తారవేయ రామాయణాన్ని
ఉంది.రచించారు.భామినీ షట్పదిలో వుంది .ఇది గేయం కూడా !
16, 17 శతాబ్దంలో ఓడ్రం లో పుట్టిన '
బలరామదాస రామాయణం మరాఠీ
భాషలో 17వ శతాబ్దంలో సమర్థ
రామదాసస్వామి; రామాయణ
భాగవతాలను, 18శతాబ్దం మోరోపంతు - రామాయణాలను రచించారు
అన్ని గేయాత్మకాలే !
పండిత, పామరులు, కులభేదం లేని వర్గ వివక్ష లేని సమాజం ఏర్పడి అందరి దైవం ( అనేకాలైన)మోక్షానికి దారి చూపే వివిధ సాధనా సోపానాలుగా చెప్పవచ్చు.
'పలుకే బంగారమాయెనా '- అని రామదాసు అన్నా ,'అడుగుదాటి
కదలనీయను. నా కభయమీయక నిన్ను విడువను' అని ఆర్తితో ప్రార్థించినా
నిధి సుఖమా రాముని సన్నిధి సుఖమా అని త్యాగయ్య స్తుతించినా
"జనక తనయ స్నానపుణ్యాదకములు "- అని కాళిదాసు మేఘ సందేశంలో పేర్కొ న్న యక్షుడు నివసించిన
రామగిర్యాశ్ర మాలు -ఆంధ్ర దేశము లోనివే.రామస్మరణం చేయనిదే జిహ్వకు పవిత్రత చేకూరాదు. కీర్తనాత్మక రచనలు అనేకం.
అంతరించి పోతున్న మన సంగీత సంస్కృతిని పరిరక్షించుకోవలసిన అవసరం - ఈ నాటి ఆధునిక యుగానికి చాలా ముఖ్యం.మొక్కై వంగనిది మానై వంగునా అన్నది నానుడి. చిన్నప్పటినుండీ క్రమశిక్షణ కలిగిన జీవితం - సు- సంపన్నం అవుతుంది. పెద్దలు ,అనుభవజ్ఞులు ఈ విషయాన్ని వారిదైన శైలిలో పిల్లలకు నచ్చ చెప్పా లి.
-డా.సి.ఉమాప్రసాదు