దండం దశగుణం భవేత్ (కథ)
పీటలమీద పెళ్లి ఆగిపోయింది.
కళ్యాణి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు..
ఇంట్లో వాళ్ళు గోలపెడుతున్నారు....
కళ్ళనీళ్ళు పెట్టుకుంది పెళ్లికూతురు...
వార్త దావానలంలా ఊరంతా వ్యాపించింది. ..
కారణం ఏమిటని? ఆరా తీశారు గ్రామపెద్ద పెదబాబుగారు...
"కళ్యాణి తండ్రి ఇస్తానన్న కట్నం పూర్తిగా ఇవ్వలేదంట...వాయిదాల పద్ధతిలో అప్పటికే మూడు వంతుల కట్నం ఇచ్చేశారుట..మిగతాది ఎలాగోలా,ఎవరి కాళ్ళో పట్టుకునైనా ఇస్తాను అని బతిమాలుతున్నాడుటకళ్యాణి తండ్రి పేర్రాజు.....
కాదు ,కట్నం మొత్తం ఇప్పుడే అప్పజెప్పాలని, లేకపోతే
మా వాడిని తీసుకొని వెళ్ళిపోతాను.అని ,పెళ్ళికొడుకు తండ్రి భీష్మించుకు కూర్చున్నాడు ....
ముహుర్తందగ్గరపడుతోంది ...
పెళ్ళికొడుకును తండ్రి రానివ్వడం లేదు..
ఏడుపులు అరుపులు కేకలు వినపడుతున్నాయి..
అమ్మలక్కల గుసగుసలు...
"పేర్రాజయితే !ఆ కట్నం కూడా ఇవ్వలేడు..
కళ్యాణి !ప్రైవేట్ కంపెనీలోఉద్యోగం చేసుకుని , డబ్బులుదాచుకుంది...
కూతురు దాచుకున్న డబ్బు తోటే, కూతురికి పెళ్లి చేస్తున్నాడుపేర్రాజు.
ఆడపిల్లకు పెళ్లి చేసేటువంటి స్తోమత కూడా లేదు...."
" పిల్లాడు ప్రేమించానని వెంటపడటం వలన , మావాళ్ళను నీకోసమే
నేను ఒప్పిస్తాను అని చెప్పినందువలన ఒప్పుకున్నారు....పెళ్ళికొడుకు తీరా! ఇప్పుడు చూస్తే , పక్కకుతప్పుకున్నాడు ..
ఏమి జరుగుతుందో "అని అంటున్నారుఊరుఊరంతా..
ఓపికగా. బాగా అంతా విన్న పెద్దబాబుగారు లేచి నిలబడ్డారు..
వీర్రాజింటికి వెళ్ల నిశ్చయించుకున్నారు...
లేచి నిలబడి, పై కండువా దులుపుకుని,
ఒకసారి వీధిలోకి వెళ్లి వచ్చారు..
వీర్రాజింటికి వెళ్లేసరికి .బయలుదేరి విడిది బయటికి వచ్చి వెళ్లి పోతామని బెదిరిస్తున్న,వియ్యంకుడి కాళ్ళు పట్టుకొని ఏడుస్తున్నాడు వీర్రాజు..
అతనిని ఆపారుపెదబాబు..'లే వీర్రాజూ! ఎందుకలా ఏడుస్తావ్ ?వెళ్ళనీ' అన్నారు..
'అది కాదు, బాబూ! 'అని,ఏదో అనబోతుంటే ,
"నా మాట మీద గౌరవంఉంటే ఆగు"అన్నారు...
వీర్రాజు కాదు .,పిల్లతరుపువాళ్లు
ఎవరరూమాట్లాడలేదు..
"ఒకసారి పెళ్లి కొడుకు
తండ్రి తారాజువ్వలా! లేచి ,
"ఇలా మాటనిలకడ లేనివారితో సంబంధం మాకొద్దు ..వెళ్తున్నాం "అని
వెళ్లడానికి వీధి గుమ్మంలోకి వచ్చాడు ..
చేపాటి కర్రలతో సిద్ధంగా ఉన్న అసిరిగాడు, తమ్మినాయుడు, రాములు, మహా యోధుల్లా నిలుచున్నారు.
పెళ్ళికొడుకు తండ్రి ముంగాళ్ళ మీద ఒక్కదెబ్బపడింది .
"చచ్చానురా దేవుడో! "అని చతికిలపడిపోయి, రాగం లంకించుకున్నాడు.
అసిరయ్య అరిచాడు ..
"ఆ పిల్ల మెడలో పుస్తెలుకట్టకుండా
మా ఊరి పొలిమేరలు దాటి ఎవులు, ఎలాగెలతారో చూస్తాను "అన్నాడు
రాములన్నాడు-
"మా ఊరు పిల్లకు అన్యాయంజరుగుతుందంటే !మేము చూస్తూ ఊరుకోము"..
"మీవాడే మా పిల్లవెంటపడ్డాడు .
ఇప్పుడు ఆడవాళ్ల ఎనకాతల కూర్చునిఅంతాచూస్తున్నాడు.అంతచేతకానవాడు ఎందుకుప్రేమించాల?"
"అయ్య నోరు అదుపులో పెట్టలేనోడు,రేపు పెళ్ళాన్ని గొంతు కోసి నరికిచంపడేటి?మర్యాదగా వెళ్లి పీటల మీద కూర్చుని పెళ్లి జరిపిస్తారో,లేక; పెళ్లి చూపులు మొదలు ఇప్పటివరకు ఖర్చులన్నీ వీర్రాజు కాళ్ళ దగ్గర పెట్టి మీరే కాళ్ళు కడిగి పుస్తి కడతారో సెప్మీపండి "అన్నాడు తమ్మినాయుడు...
"బట్టలు, నగలు, తీసుకున్న రొక్కం. ఇంతవరకు పెళ్లిచూపులకు, అయిన ఖర్చులు సమస్తమూ,,, లెక్కకట్టి, ఇక్కడ పెట్టి , కదలండి " రాములన్నాడు .
" చావు దెబ్బలు తిని , వీళ్ళిచ్చిన ప్రతి ఒక్క వస్తువు అక్కడ పెట్టి కదులుతారో.
మీకొడుకుని మర్యాదగా పీటలమీదికి పంపుతారో మీఇష్టం...గంటసమయం ఇస్తున్నాము ..ఏం చేస్తారో మీ ఇష్టం "అన్నాడు రాములు ..
పెళ్ళికొడుకు తండ్రి అన్యాయమని పెడబొబ్బలు పెట్టాడు ..
"ఇదేమి కర్మరా బాబూ?
ఇలాంటి పిల్లను ప్రేమించావు?
దరిద్రం తగలడంఅంటే ఇదే"! ఎక్కడా ఎవరు దొరకనట్టు..మోటు మనుషుల పాలపడ్డాం.పో! పోయి పుస్తెకట్టు. ..
మనపాలిమృత్యువును కోడలిగా తెచ్చుకుంటాను..."
తిట్టుకుంటూ లేచి, కుంటుకుంటూ కళ్యాణ మండపంవైపు కదిలేడు వీర్రాజు వియ్యంకుడు...
తండ్రిని అనుసరించాడు
పెళ్ళి కొడుకు...
అంత వరకూ వెక్కి వెక్కి ఏడ్చిన కళ్యాణి,
విసురుగా వచ్చి, ఒక నమస్కారం పెట్టి,
"మీ అబ్బాయివద్దు, మీ
ప్రేమవద్దు .నాకుఈ పెళ్లివద్దు..ఇలా మానాన్న కూతురుగా ఉండిపోతాను..మీవాడిలాటి వాడిచేత చచ్చినా పుస్తక కట్టించుకోను ....
ఇప్పుడేతెలిసింది ..మీవాడి నిజస్వరూపం .."అని మెడలో దండలు అన్ని తీసేసి.. అక్కడ పడేసి
లోపలకు వెళ్లి పోయింది.
"అయ్యో తప్పమ్మాఅలాచేయకూడద"ని,
ఏడుస్తున్న ,తల్లిని ,తండ్రి మాటవినలేదు....
పెద్ద బాబుగారు వీర్రాజును పిలిచిఅన్నారు ...
"కళ్యాణి !చాలా మంచి పని చేసింది "...
"నా దగ్గర గుమాస్తాగా పనిచేస్తున్న అబ్బాయి. చాలా మంచివాడు"..
అతనికి తల్లి తండ్రి లేరు ..ఆవిడకి నేనుఏదిచెప్తే అదే వేదం ...
ఇదే ముహూర్తానికి అతనితో పెళ్లి జరిపిస్తాను . నేను చూసుకుంటాను ....
నీకు సమ్మతమేనా?"అని అడిగారు ..
"ఇదే ముహూర్తానికి దివ్యంగా పెళ్లి జరిపిస్తాం అందరికీ ఇష్టమేనా "అని అడిగారు. కళ్యాణిని కూడా
పిలిచి అడిగారు...
"మీ ఇష్టం అంది కళ్యాణి"కళ్యాణితో సహా అందరూ ఒప్పుకున్నారు ...
తప్పిపోయిన వీర్రాజు వియ్యంకుడుతో
పెద్ద బాబుగారు అన్నారు
" నువ్వు చేసిన పనికి ఇంకొకరు అయితే!చంపి ఇక్కడేపాతరేసేవారు.ఆడపిల్ల జీవితం నాశనం చేయాలనుకున్న నీలాంటి వాడిని ,గుండు కొట్టించి; గాడిద మీద ఊరేగిస్తారు..
అంత డబ్బు వ్యామోహమా?
చచ్చాక సంపద కట్టుకుపోతావా?
మంచి వాళ్ళం కాబట్టి మాడబ్బు మాత్రంతీసుకుని వదిలేస్తాం ...సరే!నువ్వు వాయిదాల పద్ధతి మీద తీసుకున్న, లాంఛనాలు, కట్నం,మొత్తం ఒకేసారి ఇక్కడ పెట్టి కదులు"....
"మీ ఆడవాళ్ళ నగల తాకట్టు పెడతావో, నీ కొడుకుని మాకుతాకట్టుపెడతావో మాకు తెలియదు...కానీ !మొత్తం డబ్బు ఒక్కసారి పెట్టి వెళ్లకపోయావో ! నీకు పెద్దకర్మ చేస్తాను"అన్నారు.రౌద్రంగా ...
భయపడి ,అక్కడ అందరినీ అడిగి, వాళ్ళవాళ్ళందర్నీ అడిగి,ఆడవాళ్ళ నగలు తెచ్చి, అక్కడ పోగుపెట్టి. అక్కడినుండి తప్పుకున్నాడు
పేచీ పెట్టిన పెళ్ళికొడుకు తండ్రి
ఊరుఊరంతా పెదబాబుగారికి
చేతులెత్తిమొక్కారు..
ఆ ముహూర్తానికే, గుమస్తా గుర్నాధంతో దివ్యంగా కళ్యాణీ పెళ్ళి జరిపించారు పెద్దబాబుగారు.
కళ్యాణి కళకళలాడుతూ
మహాసంతోషంగా ఉంది...
ప్రేమించి పెళ్ళిచేసుకొని
కోపంతో తండ్రిచే వెళ్లగొట్టబడిన
పెదబాబుగారు చెల్లెలుభర్త
ప్రమాదంలో తల్లితండ్రి చనిపోయిన స్నేహితునకుఉపాధి కల్పించాలని వేడుకోవడం. .ఎవరికీ తెలియకుండా,
చెల్లెలుబావ దగ్గరకు రాకపోకలుసాగించే పెదబాబుగారు, ఆఅబ్బాయికి ఉద్యోగం ఇప్పించి తనతో ఉంచుకున్నారని ఎవరికీతెలియదు.కానీ కుటుంబాలు నిలబెట్టడంలో,పధ్ధతులు పాటించడంలోమంచిమనసుగల పెదబాబుగారు అందరికీ దేముడు...
కళ్యాణి కి మాత్రం ఇలవేల్పు.
- దామరాజు విశాలాక్షి (కెనడా)