Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Friday, September 12
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»Arts & Literature

    అత్త మ్మ (కథ)

    By Telugu GlobalDecember 31, 20226 Mins Read
    అత్త మ్మ  (కథ)
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    ” సుబ్బు…సుబ్బు.”..మంచం పై అచేతనంగా …చలనం లేని ..తన అరవై రెండేళ్ల భార్యను నిద్ర లేపే ప్రయత్నం చేశాడు…రాఘవయ్య…

    ఆమె లో చలనం లేదు..శరీరం కట్టి లా బిగుసుకు పోతోంది…చేతిని పట్టుకుని చూసాడు.. నాడి ఆడలేదు…ఒళ్లంతా చాలా చల్లగా అయిపోయింది…

    వేగంగా లేచి నిలబడడానికి ప్రయత్నించి..కళ్ళు తిరిగి.కిందకు పడబోయి…మంచం ను పట్టుకుని.. కూలబడ్డాడు…

    ఒళ్లంతా చెమటలు పడుతున్నాయి…తన ప్రాణం తనని విడిచి పోయిన..అనుభూతి..మనసుకు తెలుస్తోంది….

    నిదానంగా అడుగు లో అడుగు వేసుకుంటూ…దేవుడి పటం ముందు రెండు చేతులతో నమస్కరించి …తన భార్య ను. బతికించ మని వేడుకుంటున్నాడు… కానీ…అతని మనసు ఎందుకో కీడు శంకిస్తోంది….

    ఇక తన భార్య తిరిగి రాదని మనసు చెప్తోంది…ఆ దేవుణ్ణి వేడుకున్నా..సరే..పోయిన భార్య తిరిగి రాదని..మనసు చెప్తోంది…

    వణుకుతున్న కాళ్ళు..గుండె దడ ఒక వైపు…అడుగులు తడబుతున్నాయి…మెల్లగా తలుపు తెరుచుకుని …ఇంటి బయటకు వచ్చి. పొరుగింట్లో ఉండే నర్స్ మహాలక్ష్మి కోసం చూసాడు..,మెల్లగా అడుగులో అడుగేసుకుంటూ వస్తున్న రాఘవయ్య కు ఎదురు వెళ్లి..విషయం తెలుసుకున్న మహాలక్ష్మి..మంచం పై అచేతనంగా పడి ఉన్న సుబ్బమ్మ గారి నాడి ని పరీక్షించి…ఆమె చనిపోయినట్టు చెప్పింది…

    రాఘవయ్య..ఏది అయితే జరగ కూడదు అనుకున్నాడో..అదే జరిగింది…ఇన్నేళ్ల తన తోడు నీడ…తనని నిర్దాక్షిణ్యంగా వదిలి వెళ్ళిపోయింది…

    మహా లక్ష్మి…వీధిలో ఇరుగు పొరుగు ఇళ్లకు చెప్పి వచ్చింది…

    అదే ఊరిలో ఉండే బంధువులకు కబురు వెళ్ళింది…

    అదే ఊరిలో ఉంటున్న కూతురు సరోజ కు ఫోన్ చేసి చెప్పాడు..

    అలాగే కొడుకు అరుణ్ కు కూడా ఫోన్ చేసి విషయాన్ని చెప్పాడు…అత్తగారు మరణ వార్త విన్న కోడలు మాధవి…ఒక్కసారిగా.. షాక్ తగిలి.నట్టుగా బాధ లోకి వెళ్లిపోయింది….

    ***

    అందరు రావడం పూర్తి అవగానే…అంత్యక్రియలు అయిపోయాయి….వచ్చిన బంధువులు అందరు వెళ్లిపోయారు…

    .. తర్వాత…మాధవి కుటుంబం…సరోజ కుటుంబం మాత్రమే మిగిలారు..రాఘవయ్య గారికి.. దుఃఖం పొంగుకొచ్చింది…

    ఆ ఇంట్లో స్మశాన వాతావరణం…

    .మాధవి..సరోజ ఏదో పొడి పొడి మాటలు ..

    మాధవి ఇద్దరు పిల్లలు..మాత్రం..సరోజ ఇద్దరి పిల్లలతో కలిసి..ఏదో పిచ్చాపాటీ మాట్లాడుకుంటున్నారు…

    కానీ..అందరి మనసులో ..సుబ్బమ్మ గారి మరణం తాలూకు బాధ మాత్రం నిలవనీయడం లేదు…

    మాధవి కి అరుణ్ తో పెళ్లయిన మొదట్లోనే…సుబ్బమ్మ గారితో తల్లీ..బిడ్డల బంధాన్ని ఏర్పరచుకుంది మాధవి..

    నిజానికి మాధవి తల్లి చిన్నప్పుడే తండ్రి నుండి విడిపోయి దూరం గా ఎక్కడో బతుకుతోంది..మాధవి కి తల్లి ప్రేమ దొరకలేదు..కానీ పెళ్లి తర్వాత .సుబ్బమ్మ గారు..మాధవి ని .. ఎంతో ప్రేమగా చూసుకుంది…

    మాధవి…మనసులో అత్తా కోడళ్ళు అంటే సమస్యలు ఉంటాయేమో అనే అపోహ ను అతి త్వరగా పోగొట్టింది సుబ్బమ్మ గారు…

    ఇంట్లో పనులు చాలా వరకు సుబ్బమ్మ గారే చేసేవారు…మాధవికి చాలా తక్కువ పనులు చెప్పేవారు…

    మాధవి అత్తగారికి సాయం చేద్దామని వెళ్తే..ఎంత సేపు”..కొత్త పెళ్లి కూతురు…భర్తతో ఎక్కువ సమయం ..నవ్వుతూ సంతోషంగా గడపాలి ..ఇంకా కొన్ని రోజులు పోయాక చేద్దువు లే” అంటూ సున్నితంగా ..పంపించేసేది..

    మాధవి పెళ్లి తర్వాత…ఆలస్యంగా నిద్ర లేచేది…ఏనాడు..భర్త కానీ..అత్త మామలు కానీ…మాధవి బాధ పడేట్టుగా ..మాటలు అనేవారు కాదు……

    మాధవి లేచేసరికి ఇంట్లో పనులు..వంట పనులు సుబ్బమ్మ గారే పూర్తి చేసేవారు…

    మాధవికి ఏ చిన్న అనారోగ్యం వచ్చినా…చిన్న పిల్లలా..దగ్గరుండి…మాధవి ఆరోగ్యం బాగుపడే వరకు..ప్రేమగా చూసుకునేది సుబ్బమ్మ గారు…

    మాధవి గర్భవతి అయింది ..సుబ్బమ్మ గారి ఇంట్లో..ఒక ఆచారం వుంది..కోడలు గర్భవతి అయినప్పటి నుండి…బిడ్డను ప్రసవించేవరకు…కోడలు పుట్టింటిలోనే ఉండాలి…ఆచారం ప్రకారం పుట్టింటికి వెళ్ళాలంటే..మాధవికి దిగులు పట్టుకుంది…దానికి రెండు కారణాలు..మాధవికి తల్లి లేదు..తండ్రి ఉన్నా కూడా…సుబ్బమ్మ గారి దగ్గర ఉన్నంత లా ఉండలేదు తను…

    అసలే బిడ్డ కడుపులో పడినప్పటి నుండి వాంతులు..వికారం..అసలేమీ సహించడం లేదు..ఇక్కడే అత్తగారింట్లో ఉంటే …సుబ్బమ్మ గారు చక్కగా వండి పెడతారు…సమయానికి ఇంత తిని…బాగా విశ్రాంతి తీసుకోవచ్చు…

    కానీ..ఆచారం ప్రకారం వెళ్ళక తప్పలేదు…ప్రతి నెలా సుబ్బమ్మ గారే..మాధవి ని చూడడానికి వెళ్ళేవారు.,వెళ్ళినపుడు ఒక వారం రోజుల పాటు…మాధవి దగ్గరే ఉండి..మాధవికి రుచికరంగా వండి పెట్టేది…సుబ్బమ్మ గారు ఇంట్లో వున్నన్ని రోజులు..మాధవికి తల్లి లేని లోటు తెలిసేది కాదు

    కాన్పు జరిగిన క్షణం నుండి మాధవిని ..ఇంటికి తీసుకొని వచ్చాక..మాధవిని తల్లి లేని బిడ్డ అని కంటికి రెప్పలా కాపాడుకుంది సుబ్బమ్మ గారు…

    పచ్చి బాలింత అని..తినే భోజనం దగ్గర నుంచి…ప్రతి విషయం లో ఎంతో శ్రద్ధగా చూసుకునేది..

    వేడి అన్నం లో కాసింత నెయ్యి వేసి..వెల్లుల్లి పొడి వేసి ..సుబ్బమ్మ గారు మాధవి కి. ..భోజనం పెడితే…మాధవి ..తల్లి ప్రేమ ఇలానే ఉంటుందేమో అని అనుభూతి చెంది ..మాధవి కళ్ళు చెమరింతల కు గురి అయ్యేవి….

    ఎప్పుడూ బాలింత వేడి నీళ్లు అంటే..కాచిన నీరు మాత్రమే తాగాలి అంటూ..ఎంతో జాగ్రత్తగా..విసుగు లేకుండా చూసుకునేది..

    మాధవి అలసట తో నిద్ర పోతే..ఇంటెడు పనులు చేసి కూడా బాబు ను ఎంతో ప్రేమగా ముద్దాడుతూ …సముదాయించేది….

    నడుముకట్టు అని చెప్పి.. మెత్తటి గంజి చీర ను…మాధవి నడుముకి కట్టి బిగించింది సుబ్బమ్మ గారు.,

    .

    మాధవి స్నానం చేసి వచ్చాక..వేడి వేడి నిప్పులపై.. వాము..వెల్లుల్లి పొట్టు..సాంబ్రాణి పొగ లు వేసేది…వాటి ఉపయోగం చెప్పేది…

    ఒక్కొక్క రోజు బట్టలు ఉతికేందుకు పనిమనిషి రాకపోతే..ఇంట్లో బాలింత గుడ్డలు..చంటి బిడ్డ గుడ్డలు..శుభ్రంగా ఉతికి ..బాగా ఎండ పడే చోట ఆరబెట్టి..అరిన బట్టలని చక్కగా సర్ది పెట్టేది…

    అలాంటి దృశ్యం చూసినపుడు మాధవి..మనసు ..సుబ్బమ్మ గారి.. ప్రేమకు ఎంతో మధురమైన అవ్యక్త భావన కు లోనయ్యే ది…

    కళ్ళు ఆమె ప్రేమకు..కన్నీటి తో మసక బారేవి..ఎన్ని జన్మల పుణ్యం ఈ సాంగత్యం అనిపించేది…..

    సుబ్బమ్మ గారికి వీధుల్లో ముచ్చట్లు పెట్టే అలవాటు ఉండేది కాదు..ఎప్పుడు చూడు పని ధ్యాస తప్ప..ఇంకో వ్యాపకం ఉండేది కాదు…

    నిజానికి సుబ్బమ్మ గారికి కూతురు సరోజ ఎంతో..కోడలు మాధవి కూడా అంతే..కాకపోతే..సరోజ లో సర్దుబాటు గుణం కొంత తక్కువ..సరోజ భర్త పేరున్న కాంట్రాక్టర్…సంపన్నుల కుటుంబం..అయినప్పటికీ..సరోజ ప్రతి విషయం లో పేచీ పెట్టేది…

    పుట్టింటి నుండి…అందాల్సినవి అందుతున్నా..తృప్తి పడక ..తన తల్లి సుబ్బమ్మ ను మాటల తో వేధించేది…

    సుబ్బమ్మ గారికి మాత్రం కూతురు సరోజ అంటే..వల్ల మాలిన ప్రేమ..కారణం వాళ్ళ వంశం లో తరానికి ఒక ఆడపిల్ల పుడుతుంది.. ఇటు తన భర్త తరపున కూడా తరానికి ఒక ఆడపిల్లే అంటూ ఉండేవారు.

    …తన తల్లిదండ్రులకు కూడా..ఆరు మంది మగపిల్లల లో ఒక అమ్మాయి గా పుట్టింది సుబ్బమ్మ గారు..ఇప్పుడు తమ భర్త కుటుంబం లో ను అంతే..అందుకే కూతురు సరోజ అంటే ..ప్రేమ ఎక్కువ…సరోజ ఏమో గడుసు పిల్ల గా పెరిగింది..మొండితనం ఎక్కువ..

    ఇప్పుడు సరోజ కు తన తమ్ముడి భార్య అంటే..ఇష్టం ఉన్నప్పటికీ…తన తల్లి సుబ్బమ్మ గారు..మాధవిని అమితంగా ఇష్టపడడం నచ్చేది కాదు…

    3) ఒకసారి ఉత్తర భారత దేశం లో టూర్ కు వెళ్ళినప్పుడు..ఎంతో ఇష్టం గా..పన్నెండు వేలు పెట్టీ..గులాబీ రంగు చీరను..తన తల్లి సుబ్బమ్మ గారికి తెచ్చింది సరోజ…

    ఆ చీర ను…. రెండు లేక మూడు సార్లు కట్టి వుంటుంది సుబ్బమ్మ గారు..

    ఆ చీరను మాధవి ఇష్టం గా చూడడం తో..ఒక శుక్రవారం గుడికి వెళ్ళేటప్పుడు .ఆ గులాబీ రంగు చీరను…మాధవి ని కట్టుకోమని చెప్పింది సుబ్బమ్మ గారు…

    మాధవి కూడా ఇష్టంగా ఆ చీర కట్టుకుంది..ఆ రోజు రాత్రి గుడి నుండి రాగానే..అమ్మ ను చూడడం కోసం ఇంటికి వచ్చిన సరోజ..కంట..మాధవి..తన తల్లి చీర ను కట్టుకుని..కనపడడం ..సరోజకు ఎంత మాత్రం నచ్చలేదు…కోపం తో తల్లి తో పొట్లాడింది..అక్కడే వున్న అరుణ్…చీర కోసం..అక్క..తల్లి తో పొట్లాడుతోంది అని సర్ది చెప్పడానికి ప్రయత్నించాడు..

    అప్పటికే..అన్ని విషయాల్లో..తన తల్లి దగ్గర..తన స్థానం..తన ప్రేమ… మాధవి లాగేసుకుంది అని…గొడవ పెట్టుకుని..అలిగి ..వెళ్లిపోయింది…సరోజ.

    ఇక ఆ రాత్రి..సుబ్బమ్మ గారికి..మాధవి కి నిద్ర పట్టలేదు…

    సుబ్బమ్మ గారు ఎంత బతిమాలినా..సరోజ పుట్టింటి వైపు రాకుండా మొహం చాటేసింది….

    అదే సమయం లో ఒక రోజు రాత్రి అల్లుడి గారి నుండి ఫోన్..సరోజకు ఆరోగ్యం సరిగా లేదని..హాస్పిటల్ లో జాయిన్ చేశారని..

    వెంటనే కుటుంబం అంత హాస్పిటల్ కు చేరారు…చిన్నగా గుండెపోటు… అంత చిన్న వయసుకు ..అలాంటి అనారోగ్యం రాకూడదని డాక్టర్ ల హెచ్చరిక….

    సుబ్బమ్మ గారికి తన కూతురి మొండి తనం తెలిసిన విషయమే…భయపడి పోయింది..ఏదైనా జరగరానిది జరిగితే…పరిస్థితి ఏంటి అని..

    ..

    పరిస్థితి అర్థం చేసుకున్న మాధవి..అరుణ్ కు చెప్పి దూరంగా వేరు కాపురం పెట్టేశారు…అప్పుడప్పుడు వచ్చి అత్త మామల తో సంతోషంగా గడిపి వెళ్ళేవారు.

    మాధవి దూరంగా ఉంటున్నా..సుబ్బమ్మ ప్రాణం..మాధవి కోసం కొట్టుమిట్టాడుతూ ఉండేది…..

    ఎలాగోలా పిల్లల బాధ్యతలు తీర్చింది..సుబ్బమ్మ గారు…

    మాధవి పట్ల తనకున్న అనుబంధాన్ని ప్రేమను ఏ రోజు మాటలతో వ్యక్త పరిచింది లేదు.. కానీ.. సుబ్బమ్మ బాధ్యతాయుత మైన ప్రవర్తన.. ..సుబ్బమ్మ గారి వ్యక్తిత్వాన్ని..కుటుంబం పట్ల ప్రేమని.. చెప్పకనే చెప్పేది.

    .

    చూసే అందరికీ మాధవి కి అత్త గారి పట్ల ప్రేమ లేదేమో అనిపిస్తున్నా..మాధవి మనసుకు తెలుసు..సుబ్బమ్మ గారు తనకు అత్త కాదు..అత్త గారిలా కనిపించే తల్లి హృదయం అని..

    .చిన్నప్పుడే..మాధవి తల్లి ప్రేమ కు దూరం అయినా..అసలైన తల్లి ప్రేమ ను అనుభవించింది మాత్రం సుబ్బమ్మ గారి దగ్గరే…మాధవి ఏదైనా పొరపాటు చేసినా…

    సుబ్బమ్మ గారి సున్నిత మందలింపు…ఏదైనా పని పూర్తి చేస్తే . ఆమె నుండి వచ్చే మెచ్చుకోలు…మాధవిని..పసి పిల్ల గా మార్చే అనుభూతులు…

    మాధవి ఏదైనా విషయం లో అరుణ్ తో పొట్లాడితే…సుబ్బమ్మ గారు మాధవి నే సమర్థించేది.

    ..అరుణ్ కు ” మాధవి తల్లి లేని పిల్ల అని..మనమే సర్దుకుపోవాలి..”అని చెప్తూ ఉండేది… సుబ్బమ్మ గారు

    మాధవి పెళ్లి తర్వాతి జీవితం లో…అత్త సుబ్బమ్మ గారి ప్రేమ..ఆప్యాయత…తనను..మానసికంగా.. ఒక పరిపూర్ణ స్త్రీ గా ..ప్రేమ మయి గా మార్చింది…

    4) ఆత్తగారి మరణం తర్వాత…ఎందుకో..మాధవి కళ్ళల్లో నుండి..కన్నీరు ఆగింది కానీ..గుండెల్లో …సుబ్బమ్మ గారి కోసం..ప్రవహించే..ప్రేమ తడి మాత్రం తగ్గలేదు…అత్తగారు ప్రేమ పూరిత గుణాలను …ఆచరణ లో చూపిస్తూ..మంచి తల్లిగా..భార్యగా…తన జీవిత ప్రయాణాన్ని సాగించింది మాధవి..ఎప్పటికైనా..తన మరణం తో తన అత్తగారిని చేరుకుంటుంది…తమది ఋణానుబందం..

    .ఇంకో జన్మ లో తమని ఏదో ఒక ప్రేమ బంధం లో ఆ దేవుడు ముడి వేస్తాడు అనే నమ్మకం మాధవి ..అంతరాత్మ లో ఘోషిస్తోంది

    సరోజ తో కూడా ప్రేమ పూరితంగా వ్యవహరిస్తూ..మామ గారిని కంటికి రెప్పలా చూసుకుంటూ…అత్తమ్మ కు తగ్గ కోడలు అనిపించుకునే ప్రయత్నం లో…జీవితాన్ని కొనసాగించాలని నిర్ణయించుకుంది…..తల్లి మరణం తో సరోజ లో కూడా కొద్దిగా మార్పు మొదలైంది..

    కుటుంబం ప్రేమలకు నిలయం…సంతోషమే పరమావధి…ఒకరికొకరు గా సహాయం సహకారాలతో బాధ్యతగా ఉండడం ముఖ్యం.

    రచన: డబుర ధనలక్ష్మి

    (స్కూల్ అసిస్టెంట్.కడప)

    హిందూపురం

    Attamma Telugu Kathalu
    Previous Articleఆపిల్ వాచ్ మోస పూరితం, జాతి వివక్షతో కూడుకున్నది….కేసు నమోదు
    Next Article S5 No Exit Movie Review: ‘ఎస్ 5- నో ఎగ్జిట్’ మూవీ రివ్యూ! {1.5/5}
    Telugu Global

    Keep Reading

    కాకతీయ కళాసంస్కృతి

    తెలంగాణ భవన్‌లో సంత్‌ సేవాలాల్‌ జయంతి

    మంద కృష్ణకు పద్మ శ్రీ

    పద్మ శ్రీ అవార్డులు ప్రకటించిన కేంద్రం

    దాశరథి శతజయంతి ఘనంగా నిర్వహించాలి

    నాకు భేషజాలు లేవు.. తెలంగాణ కోసం ఎవరినైనా కలుస్తా

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.