కలకాలం ఉండవు కన్నీళ్లు…
కలతలు,కష్టాలు కొన్నాళ్లే!
చీకటి వెంట వెలుతురు…
ఓటమి వెనుక గెలుపు!
శిశిరం వెంట వసంతం…
లేమి వెనుక కలిమి!
ప్రమాదాల వెంట ప్రమోదాలు…
విషాదాల వెనుక ఆనందాలు!
ఎప్పుడూ ఒకరీతి ఉండదుగా కాలం…
చక్రభ్రమణమేగా దాని నైజం!
నిరీక్షించే సహనం నీకుంటే…
ఆశావాదం నీ తోడుంటే…
మనసారా నీవు కోరుకుంటే…
ముందుండవా మంచిరోజులు…
దరిచేరవా సుఖశాంతులు!!!
-చంద్రకళ. దీకొండ
(మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా)