అవిస్మృత చిత్రకారుడు ఎం .ఎఫ్ .హుస్సేన్
ప్రముఖ చిత్రకారుడు
ఎం .ఎఫ్ .హుస్సేన్
వర్థంతి జూన్ 9
**************************
సంక్షిప్త జీవన రేఖలు
**************************
మక్బూల్ ఫిదా హుసేన్
(సెప్టెంబరు 17 ,1915 - జూన్ 9, 2011)
Maqbool Fida Husain
*ఎమ్.ఎఫ్.హుసేన్ మహారాష్ట్ర పండర్ పూర్ లో 1915 సెప్టెంబర్ 15 న జన్మించారు.భారతదేశపు చిత్రకారుడిగా ప్రపంచ ప్రసిద్ధి గాంచారు ,దాదాపు 7 దశాబ్దాలు కళాకారుడిగా ఎంతగానో రాణించారు
ఎం .ఎఫ్ .హుసేన్ -సులేమాని బోహ్రా కుటుంబానికి చెందిన వారు ఆయన తల్లి, హుసేన్ 2వ యేటనే మరణించింది. తండ్రి రెండవ పెళ్ళి చేసుకుని ఇండోర్ వెళ్ళిపోయాడు.
1935లో హుసేన్ ముంబాయి లోని సర్.జె.జె.స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో చేరారు .హుసేన్ సినిమా హోర్డింగుల పెయింటింగ్ ప్రారంభించారు ఆ తర్వాత క్రమక్రమంగా ప్రపంచ ప్రసిద్ధ చిత్రకారుడిగా ఎదిగారు .ఫోర్బ్స్ మేగజైన్ "భారతీయ పికాసో"గా పేర్కొంది. తన విజయవంతమైన ప్రస్థానంలో 1996లో వివాదాస్పదమైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. 1970లో హిందూ దేవతామూర్తులను నగ్నంగా చిత్రీకరించాడని అభియోగం
శివసేన కార్యకర్తలు అయన ఇంటిపై దాడి చేసారు . ఆయనపై కోర్టుల్లో అనేక కేసులు నమోదయ్యాయి . దేశం విడిచిఆయన లండన్ వెళ్ళాడు .
96 ఏళ్ల నిండు జీవితం గడిపిన హుస్సేన్ ౯ జూన్ 2011 న లండన్లో (అక్కడి కాలమానం ప్రకారం జూన్ 8 న తెల్లవారుజామున 2:30ని|| కు) అనారోగ్యంతో మరణించారు..
మాతృభూమి అయిన భారత్‌కు తిరిగిరాలేని స్థితిలో ఆయన తనువు చాలించారన్న వార్త ఎందరికో ఎంతగానో బాధ కలిగించింది.
నేను నా సొంత గడ్డ మీద కాలు మోపలేకపోతుండటం బాధాకరంగానే ఉంది. దీనికి కేవలం కొద్దిమందే కారకులు. నేనొక జానపద చిత్రకారుడిలాంటి వాణ్ణి! ప్రపంచంలో నాకంటూ ఎక్కడా స్టూడియో లేదు. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ కాన్వాస్‌పెట్టుకోవటం..
బొమ్మలేసుకోవటం.. వెళ్లిపోవటం.. అంతే! నేనే నేరమూ చెయ్యలేదు.నన్ను వ్యతిరేకించే వాళ్లు చాలా కొద్దిమందే.. నేను ఎందుకు తిరిగి రాలేనో వాళ్లకు తెలుసు.. నేనేమీ రాజకీయ నాయకుడినో, సామాజిక ఉద్యమకారుడినో కాదు. నేనో కళాకారుడిని. నేను చేసే ప్రతి పనీ ఓ కళాత్మకమైన వ్యక్తీకరణే! కళాకారుడి ప్రకటనే. దేశవ్యాప్తంగా నా మీద దాఆపు 900 కేసులున్నాయి. ఇంత పెద్ద వయసులో ఎక్కడెక్కడో కోర్టుల చుట్టూ ఎక్కడ తిరుగుతాను? గత 12 ఏళ్లుగా మా లాయర్‌కు నెలనెలా 60-70 వేలు కడుతూనే ఉన్నా.నేను భారత్‌కు దూరం కాలేదు.. కాలేను" -ఎం .ఎఫ్ .హుస్సేన్
- ఎన్ .జహంగీర్
మన తెలుగు చిత్రకారులు ఆయనను ఎంతో అభిమానించారు :
ఆయన శాశ్వతంగా వెళ్లిపోక మునుపే పంపించేశాం, తరిమేశాం... భయపెట్టి, బెదిరించి, మెడమీద కత్తిపెట్టి. ఒక కళాతపస్విని పొలిమేరలు దాటేదాకా తరిమితరిమి కొట్టాం.ఆయన జీవిత చరమాంకంలో వూపిరి సలుపుకోలేనన్ని కేసులు. బతుకు భయం. దిక్కు వెదుక్కొని పారిపోవాల్సిన పరిస్థితి...! చంపేస్తామని బెదిరించారు. చనిపోయారుగా !... ఇప్పుడేం చేస్తాం? ఆయన బొమ్మలూ శైలీ, రీతులూ, మార్గం- అజంతా ఎల్లోరాల్లా చిరాయువులు. అవి ఈ దేశ సంపద. హుసేన్ చిరాయువు.”
- శ్రీధర్
( ఈ నాడు కార్టూనిస్టు)
"ఆయన ఇండియాలోనే ఉంటే, ఉండనిస్తే ఇంకా కొంత కాలం హాయిగా బతికేవారు. మనం ఇచ్చిన పద్మశ్రీ, పద్మభూషణ్. పద్మవిభూ షణ్‌లు ఆయనకు తక్కువే. ఆధునిక భారతీయ చిత్రకళకు అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన హుస్సేన్‌ను ‘భారతరత్న’తో సత్కరిస్తే, మన సమాజం తనను తాను సంస్కరించుకున్నట్లే!--- "
- శంకర్ (కార్టూనిస్టు)