Telugu Global
Arts & Literature

నేటి గిరీశం (గల్పిక )

నేటి గిరీశం (గల్పిక )
X

మా మేనమామయ్య నిజంగా గిరీశంలా ఫోజు పెడుతూ, ఓ లెవల్లో ఉంటే, మా అమ్మమ్మ అరవడం మొదలు పెట్టేది. సంపాదన లేదని, పిల్లని ఎవరిస్తారని, పెళ్లి వయసు మించి పోయ్యిందని.

అవేమి ఖాతరు చేయక మా చందమామ అదే మా మేనమామ ఆకాశంలో రింగు రింగులుగా చుట్ట కాల్చి పొగలు వదులుతుంటే మేమంతా అతనో ప్రపంచ రికార్డు సాధించినట్టు అతని చుట్టూ కేరింతలు కొడుతుంటే మా అమ్మమ్మ అరుపులకుపరిగెత్తే వాళ్ళం.

మా మామయ్య ఘటికుడు. పీనాసి. అదో పక్కా ఆక్టివిటీ ఉంది. పైసా ఖర్చు పెట్టడు. అన్ని ఉచితంగా సంపాదించుకో గలడు. ఆ చుట్టని అలా సంపాదించి రింగు రింగులుగా వదలడం ,ఊరి వారందరూ "అలా తాగకు. కాన్సర్ వస్తుందని భయ పెట్టేవారు.

మా అమ్మమ్మతో చెప్పేవారు.

అమ్మమ్మకు ఎంతో భయమేసింది. "అదేదో కాన్సర్ రోగం అట, ఆ మాదిరి చుట్ట కాలుస్తే వస్తుందట రా!అందరూ అంటున్నారు" అంటూ సినిమాలోని నిర్మలమ్మ లాగే అంటుంటే, మేమంతా విని మామయ్యకు "ఇక తాగొద్దని"బతిమలాడుతుంటే, దగ్గడం మొదలు పెట్టాడు.

మేమంతా జడుసుకున్నాము.

సినిమాలలో చూస్తున్నాము కదా రక్తం కక్కుకోవడం, హీరో చనిపోవడం. ఆ సిన్మాలన్నీ చూపించాము మామయ్యకు. అప్పుడు భయపడ్డాడు. తన తల్లిని తను పోతే ఎవరు చూస్తారని, డాక్టర్ దగ్గర కెళ్ళి చూపిస్తే " కాన్సర్" మొదటి స్టేజి అని చుట్ట తాగడం వల్లేవచ్చిందని, ఇక మానమని తప్పక నయమౌతుందని భరోసా ఇచ్చాడుడాక్టర్

ఇప్పుడు మా మామయ్య అలనాటి గిరీశంలా లేడు. సంపూర్ణ ఆరోగ్యవంతుడయ్యాడు. చక్కగా ఉద్యోగం సంపాదించుకున్నాడు. ఇప్పుడు మా మామయ్య పెళ్లి కొడుకయ్యాడు. "అమ్మ" మీది చింతన మనిషిని ఎంతగా మార్చింది.

- ఆసూరి ఉషారాణి

(తిరుపతి )

First Published:  28 Feb 2023 7:39 AM GMT
Next Story