Telugu Global
Arts & Literature

కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు సలహా మండలి సభ్యుల నియామకం

కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు సలహా మండలి సభ్యులను ఈ రోజు నియమించింది.

కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు సలహా మండలి సభ్యుల నియామకం
X

కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు సలహా మండలి సభ్యులను ఈ రోజు నియమించింది. వీరి పదవీకాలం 5 సంవత్సరాలు.

సభ్యులుగా సీనియర్ కవి, తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాళేశ్వరం శంకరం;

పి.జి.పాఠ్యపుస్తకాల సంపాదకులు, రచయిత, ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.ఎస్.రఘు;

తెలంగాణ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ఆచార్యులు కె. లావణ్య;

వేమన విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ఆచార్యులు ప్రముఖ కథా రచయిత్రి, వినోదిని;

సీనియర్ జర్నలిస్టు, ప్రముఖ కథా నవలా రచయిత చింతకింది శ్రీనివాసరావు;

ప్రముఖ రచయిత వల్లూరి శివప్రసాద్ గార్లను

కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి కె. శ్రీనివాస్ రావు నియమించారు. వీరి నియామకం పట్ల ఉభయ తెలుగు రాష్ట్రాల కవులు, రచయితలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు సాహిత్యాభిమానులు వీరికి అభినందనలు తెలియజేస్తున్నారు.

First Published:  5 April 2023 6:11 PM IST
Next Story