కలియుగపు ఆకాశవాణి ఈ చరవాణి…
ఈ కాలపు సంజీవని ఈ చరవాణి…
అన్నింటిని తినేసి…
అన్నీ తానై
అందరికి అత్యవసర అవయవమై
అందరిని తన చుట్టూ తిప్పుకుంటున్నా
ఆన్లైన్ రాణి ఈ చరవాణి…
బంధాలు అనుబంధాలు…
బాధలు బోధలు…
నవ్వులు పువ్వులు…
అన్నీ ఇచ్చే అల్లావుద్దీన్ ఆన్లైన్ దీపం ఈ చరవాణి…
మాయలేదు.
మంత్రం లేదు
ఏడు సముద్రాలు దాటాల్సిన పనే లేదు
మనిషన్నోడి ప్రాణం
చరవాణి చిలకలో దాక్కుంది…
చరవాణి సంకెళ్ళకు
శాశ్వత ఖైదీ
ఈ మనిషి…
– అభిరామ్