మళ్లీ విదేశాలకు లోకేష్..! రహస్యం ఎందుకన్న వైసీపీ
వైసీపీ నుంచి ట్వీట్ పడిన వెంటనే నారా లోకేష్ ఓ కవరింగ్ ట్వీట్ వేయడం విశేషం. తాను 'స్కిల్ సెన్సెస్' సర్వేపై స్కిల్ డెవలప్మెంట్ అధికారులతో ఉండవల్లిలోని తన నివాసంలో సమావేశమయ్యానని ట్వీట్ వేశారు. ఫొటోలు కూడా జతచేశారు.
లోకేష్, జగన్ పర్యటనల నేపథ్యంలో ఆమధ్య టీడీపీ, వైసీపీ మధ్య ట్వీట్ వార్ జరిగింది. మంత్రి నారా లోకేష్ చెప్పా పెట్టకుండా విదేశాలకు ఎందుకెళ్లారని వైసీపీ ప్రశ్నిస్తే, వైసీపీ అధినేత జగన్ వారానికోసారి బెంగళూరు ఎందుకెళ్తున్నారో చెప్పాలంటూ టీడీపీ నిలదీసింది. మధ్యలో నారా లోకేష్ స్వయంగా కలుగజేసుకోవడం విశేషం. తానెక్కడికీ పారిపోలేదని, ప్రభుత్వానికి, అధికార యంత్రాంగానికి తెలిసే తన పర్యటన జరిగిందని వివరణ ఇచ్చారు. అంతమందికి చెప్పినోళ్లు, మీడియాకి కూడా చెప్పొచ్చుకదా అని లాజిక్ తీశారు వైసీపీ నేతలు.
2 వారాల్లో రెండోసారి..
ఈ వ్యవహారం మరోసారి రచ్చగా మారింది. మళ్లీ నారా లోకేష్ విదేశాలకు వెళ్లారని, అది కూడా రహస్యంగా జరిగిందని వైసీపీ ఆరోపిస్తోంది. రెండు వారాల్లో ఇది రెండోసారి అని అని తేల్చింది. అసలు పార్టీ నాయకులకు, అధికారులకు తెలియకుండా లోకేష్ ఎందుకు విదేశాలకు వెళ్లారని వైసీపీ సూటిగా ప్రశ్నిస్తోంది.
మరోసారి రహస్యంగా విదేశాలకు @naralokesh.
— YSR Congress Party (@YSRCParty) August 23, 2024
పార్టీ నాయకులకు, అధికారులకు తెలియకుండా విదేశాలకు లోకేష్.
రెండు వారాల్లో ఇది రెండోసారి.
ఎక్కడకు వెళ్లాడో మరి?
వైసీపీ నుంచి ట్వీట్ పడిన వెంటనే నారా లోకేష్ ఓ కవరింగ్ ట్వీట్ వేయడం విశేషం. తాను 'స్కిల్ సెన్సెస్' సర్వేపై స్కిల్ డెవలప్మెంట్ అధికారులతో ఉండవల్లిలోని తన నివాసంలో సమావేశమయ్యానని ఆయన ట్వీట్ వేశారు. ఫొటోలు కూడా జతచేశారు. ఇక్కడే ఆయన తన తెలివితేటలు చూపించారంటోంది వైసీపీ. శుక్రవారం మధ్యాహ్నం విజయవాడ నుంచి శంషాబాద్‌కు, తర్వాత విదేశాలకు స్పెషల్ ఫ్లైట్‌లో నారా లోకేష్ రహస్యంగా వెళ్లారని.. ఉదయం జరిగిన మీటింగ్ ని ఆయన మధ్యాహ్నం తర్వాత ఎందుకు ట్విట్టర్లో పెట్టారని వైసీపీ ప్రశ్నిస్తోంది. ప్రజలను డైవర్ట్ చేయడానికే ఆయన ఇలా చేస్తున్నారని, అసలు తన టూర్ వివరాలను అధికారికంగా విడుదలచేయడానికి లోకేష్ కి ఉన్న ఇబ్బంది ఏంటని వైసీపీ అడుగుతోంది. దీనికి టీడీపీ కౌంటర్ ఏంటి..? అసలు లోకేష్ ఏదేశానికి..? ఎందుకు..? వెళ్లారనేది తేలాల్సి ఉంది.
నారా లోకేష్… ఈరోజు మధ్యాహ్నం విజయవాడ నుంచి 1:30కు శంషాబాద్‌కు, తర్వాత విదేశాలకు స్పెషల్ ఫ్లైట్‌లో రహస్యంగా వెళ్లారు. రెండు వారాల్లో రెండోసారి రహస్య విదేశీ పర్యటనపై మేం ట్వీట్ చేయగానే, ప్రజలను డైవర్ట్ చేయడానికి ఈ ఉదయం అధికారులతో చేసిన రివ్యూపై ఇప్పుడు ట్వీట్ చేశారు. మంత్రిగా… https://t.co/dW9Svhe2HW
— YSR Congress Party (@YSRCParty) August 23, 2024