ఏపీలో ప్రధాన ప్రతిపక్ష హోదా వైసీపీకే ఇవ్వాలి
ఇటీవల తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా జరిగిన హింసపై ఆయన కోర్టుకెక్కిన సుబ్రహ్మణ్య స్వామి

ఏపీలో ప్రధాన ప్రతిపక్ష హోదా వైసీపీకే దక్కాలని బీజేపీ సీనియర్ నేత, ప్రముఖ లాయర్ సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. ఏపీలో ప్రతిపక్షంలో ఒక్క వైఎస్‌ఆర్‌సీపీనే ఉన్నది. కాబట్టి ఆ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడంలో ఎలాంటి తప్పులేదన్నారు. అసెంబ్లీలో తక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నా వైసీపీకి ఆ హోదా దక్కాల్సిందేనిన స్పష్టం చేశారు.
ఇటీవల తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా జరిగిన హింసపై ఆయన కోర్టుకెక్కారు. ఏపీ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. తిరుపతిలో డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా దురదృష్టకరమైన సంఘటన జరిగింది. చాలామందిని భయపెట్టి దాడులు చేశారు. ఎన్నికల సమయంలో హింసను నివారించడానికి తీవ్రమైన చర్యలు తీసుకోవాలని పిల్ వేశాను. నేను వేసిన ఈ పిల్ మార్చి 12న విచారణకు వస్తుందన్నారు. తిరుపతిలో ఎఫ్‌ఐఆర్ మాత్రమే వేశారు. ఎఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ విషయంలో కోర్టు చర్యలు తీసుకుంటే.. దేశవ్యాప్తంగా ఇదొక చట్టంగా మారుతుందని సుబ్రహ్మణ్య స్వామి అభిప్రాయపడ్డారు.