టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో విచారణకు హాజరైన వైసీపీ నేతలు
పోలీసుల విచారణకు హాజరైన వారిలో దేవినేని అవినాశ్, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం

టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలు దేవినేని అవినాశ్, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం పోలీసుల విచారణకు హాజరయ్యారు. మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్‌లో ఈ ముగ్గురు వైసీపీ నేతలను విచారిస్తున్నారు. దాడి రోజు పొద్దున వీళ్లంతా ఎక్కెడెక్కడ కలిశారు? ఏయే ప్రాంతాల్లో భేటీ అయ్యారు? తదితర వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
మరోవైపు ఈ కేసును వేగంగా విచారించడానికి ఏపీ ప్రభుత్వం సీఐడీకి అప్పగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కొన్ని సాంకేతిక కారణాలతో ఈ కేసు సీఐడీకి అప్పగించడంలో ఆలస్యమౌతున్న నేపథ్యంలో మంగళగిరి పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 2021 అక్టోబర్ 19న ఆ పార్టీకి చెందిన వారు టీడీపీ కార్యాలయంపై దాడికి పాల్పడ్డాయి. వైసీపీ నేతలు దేవినేని అవినాశ్, ఆళ్ల రామకృష్ణారెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి అనుచరులు ఈ దాడికి పాల్పడ్డారని ఆరోపణలున్నాయి.