అన్న క్యాంటీన్‌లో డ్రామా.. అడ్డంగా దొరికిన టీడీపీ!
అతను వీడియోలో చెప్పినంత పేదవాడేమి కాదని, KFC సహా పలు రెస్టారెంట్లలో చికెన్, బిర్యానీలు తింటున్న వంశీ వీడియోలను సోషల్‌మీడియాలో పోస్టు చేస్తున్నారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం గుడివాడలో అన్న క్యాంటిన్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా స్వయంగా టోకెన్ తీసుకున్న చంద్రబాబు అన్న క్యాంటిన్‌లో భోజనం చేశారు. భోజనం చేస్తూ అక్కడున్న వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా ఓ వ్యక్తి చంద్రబాబు పక్కనే నిలబడి.. జగన్ సర్కార్ అన్న క్యాంటిన్లను ఎత్తేయడంతో కరోనా టైంలో తీవ్ర ఇబ్బందులు పడ్డామన్నారు. ఆర్థికంగా చితికిపోయి ఓ పూట తినడానికి కూడా ఉండేది కాదంటూ బాబుతో చెప్పారు. తాను చికెన్ పకోడి బండి నడుపుతానంటూ బాబుకు వివరించారు.
ఓవర్ యాక్షన్ చేయడం.. వెంటనే దొరికిపోవడం @JaiTDPకి అలవాటైపోయింది
— YSR Congress Party (@YSRCParty) August 16, 2024
అన్న క్యాంటీన్ లేక ఐదేళ్లు పస్తులున్నట్లు నిన్న @ncbnతో కలిసి భోజనం చేస్తూ.. సామాన్యుడిలా ఓవర్ యాక్షన్ చేసిన టీడీపీ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అనుచరుడు వంశీ
కేఎఫ్సీలో దర్జాగా చికెన్ తింటున్న వంశీ ఫొటోలు, ఎన్నికలకి… pic.twitter.com/GBtl9yWeg8
ఈ వీడియో కాస్త వైరల్‌గా మారింది. దీంతో చంద్రబాబుతో మాట్లాడిన వ్యక్తి ఎవరో తేల్చే పనిలో పడ్డారు వైసీపీ శ్రేణులు. చివరికి ఆ వ్యక్తిని గుర్తించారు. సదరు వ్యక్తి ఎవరో కాదని.. టీడీపీ నేత, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అనుచరుడు వంశీ అని వైసీపీ నేతలు తేల్చారు. అంతే కాదు అతను వీడియోలో చెప్పినంత పేదవాడేమి కాదని, KFC సహా పలు రెస్టారెంట్లలో చికెన్, బిర్యానీలు తింటున్న వంశీ వీడియోలను సోషల్‌మీడియాలో పోస్టు చేస్తున్నారు.
ఇక వైసీపీ సైతం ఈ విషయంపై స్పందించింది. ఓవర్ యాక్షన్ చేయడం వెంటనే దొరికిపోవడం టీడీపీకి అలవాటైపోయిందంటూ ట్వీట్ చేసింది. అన్న క్యాంటీన్ లేక ఐదేళ్లు పస్తులున్నట్లు యాక్టింగ్ చేసిన వ్యక్తి టీడీపీకి చెందిన వ్యక్తేనని స్పష్టం చేసింది. KFCలో దర్జాగా చికెన్ తింటున్న వంశీ ఫొటోలు, ఎన్నికలకు ముందు టీడీపీకి మద్దతుగా అతను చేసిన వీడియోలను పోస్టు చేసింది వైసీపీ. ఆర్టిస్టుతో డ్రామా రక్తి కట్టించినా టీడీపీ అడ్డంగా దొరికిపోయిందని సెటైర్ వేసింది. రాష్ట్రంలో 100 అన్న క్యాంటీన్లు ప్రారంభించి.. ఒక్కో క్యాంటీన్‌లో రోజుకూ కేవలం 300 మందికి అన్నం పెట్టి.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 4.5 కోట్ల మందికి అన్న క్యాంటీన్ల ద్వారానే అన్నం పెడుతున్నట్లుగా టీడీపీ నేతలు బిల్డప్ ఇస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.