అమరావతి నిర్మాణానికి ప్రపంచబ్యాంక్ అప్పు
గురువారం జరిగిన ప్రపంచ బ్యాంకు బోర్డు భేటీలో 800 మిలియన్ డాలర్ల రుణానికి ఆమోదించినట్లు సమాచారం
BY Raju Asari20 Dec 2024 10:55 AM IST
X
Raju Asari Updated On: 20 Dec 2024 10:55 AM IST
అమరావతి నిర్మాణానికి అప్పు ఇవ్వడానికి ప్రపంచ బ్యాంకు ఆమోదించినట్లు తెలుస్తోంది. గురువారం జరిగిన ప్రపంచ బ్యాంకు బోర్డు భేటీలో 800 మిలియన్ డాలర్ల రుణానికి ఆమోదించినట్లు సమాచారం. అమరావతికి ఇప్పటికే 788 మిలియన్ డాలర్ల రుణాన్ని ఏడీబీ మంజూరు చేసింది. అమరావతి నిర్మాణానికి నిధులు ఇస్తామని కేంద్ర బడ్జెట్ లో ప్రకటన చేసిన విషయం విదితమే. ప్రపంచ బ్యాంకు, ఏడీబీల ద్వారా నిధులు సమకూరుస్తామని చెప్పింది. రెండు సంస్థల ద్వారా 1588 మిలియన్ డాలర్ల ద్వారా నిధులు సమకూరుతాయి. ఈ నేపథ్యంలోనే ప్రపంచ బ్యాంకు ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది.
Next Story