Telugu Global
Andhra Pradesh

హమ్మయ్య.. అమరావతికి అప్పు వచ్చేసింది

'అప్పుచేసి అమరావతి' అనే కాన్సెప్ట్ పట్టాలెక్కడానికి రెడీగా ఉంది. కేంద్రం ఇప్పించే రూ.15వేల కోట్లతో అమరావతి రూపు రేఖలు ఏమేరకు మారిపోతాయో చూడాలి.

హమ్మయ్య.. అమరావతికి అప్పు వచ్చేసింది
X

అమరావతికి అప్పు పుట్టింది. ఈరోజు ఏపీ సెక్రటేరియట్ లో సీఎం చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంక్(ఏడీబీ) ప్రతినిధుల బృందం సమావేశమైంది. అమరావతి నిర్మాణానికి ప్రపంచబ్యాంకు, ఏడీబీ రుణం సమకూర్చేందుకు సుముఖత వ్యక్తం చేశాయి. ఈ రెండు బ్యాంకుల ప్రతినిధులు ఈనెల 27 వరకు అమరావతిలో పర్యటిస్తారు. అనంతరం విధి విధానాలు ఖరారు చేస్తారు. బ్యాంకులిచ్చే అప్పుతో ఏయే కార్యక్రమాలు చేపడతారు, వాటి ద్వారా ప్రభుత్వానికి లాభం ఏంటి..? అనే విషయాలపై అధికారులు బ్యాంక్ ప్రతినిధులకు అవగాహన కల్పిస్తున్నారు.

'అప్పుచేసి అమరావతి' అనే కాన్సెప్ట్ పట్టాలెక్కడానికి రెడీగా ఉంది. ఏపీ రాజధానికి కేంద్ర బడ్జెట్ లో 15వేల కోట్ల రూపాయలు ఘనంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ప్రకటన సమయంలో అది అప్పు అని నొక్కి చెప్పలేదు. ఆ తర్వాత ప్రతిపక్షం గొడవ చేయడంతో అవును అప్పే అని కేంద్రం తేల్చేసింది. అప్పు అయితే ఏంటి అని టీడీపీ నేతలు కూడా స్వరం పెంచారు. వరల్డ్ బ్యాంక్ లాంటి సంస్థలు, కేంద్రం పూచీకత్తుతో ఇచ్చే అప్పు కాబట్టి దాని ప్రభావం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పెద్దగా ఉండదని చెప్పుకొచ్చారు సీఎం చంద్రబాబు.

జగన్ రెండోసారి సీఎం అయి ఉంటే తన ప్రమాణ స్వీకారం విశాఖలోనే అని తేల్చి చెప్పారు. వైసీపీ తిరిగి అధికారంలోకి వచ్చి ఉంటే అమరావతి గురించి ఇంత చర్చ జరిగి ఉండేది కాదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాజధాని అమరావతి నిర్మాణం మళ్లీ మొదలైంది. ఈసారి సినిమా వాళ్ల గ్రాఫిక్ లు, అంతర్జాతీయ డిజైన్లు అంటూ.. నేలవిడిచి సాము చేయకుండా ప్రభుత్వం కాస్త లో ప్రొఫైల్ మెయింటెన్ చేస్తోంది. అమరావతి అంటే అన్నీ తాత్కాలిక నిర్మాణాలే అనే అపవాదు లేకుండా చేయాలని చంద్రబాబు ట్రై చేస్తున్నారు. ప్రస్తుతం కేంద్రం ఇప్పించే రూ.15వేల కోట్లతో అమరావతి రూపు రేఖలు ఏమేరకు మారిపోతాయో చూడాలి.

First Published:  20 Aug 2024 5:16 PM IST
Next Story