Telugu Global
Andhra Pradesh

డిప్యూటీ సీఎం గారూ మీరైనా సమాధానం చెప్తారా?

కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకానికి సంబంధించిన గైడ్ లైన్స్‌ వివరిస్తూ ఒక జీవో జారీ చేయగా.. అందులో తల్లికి మాత్రమే ప్రభుత్వ సాయం అందిస్తామని ఉంది.

డిప్యూటీ సీఎం గారూ మీరైనా సమాధానం చెప్తారా?
X

ఏపీలో కూటమి ప్రభుత్వం అమలు చేయనున్న తల్లికి వందనం పథకంపై అందరిలోనూ గందరగోళం నెలకొంది. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ తల్లికి వందనం పేరిట రూ. 15వేల చొప్పున సాయం చేస్తామని ఎన్నికల ముందు చెప్పిన కూటమి నాయకులు ఇప్పుడు ప్రజలను గందరగోళంలో పెడుతున్నారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం అందుతుందని చెబుతూనే.. ఈ పథకానికి సంబంధించి విడుదల చేసిన జీవోలో మాత్రం తల్లికి మాత్రమే సాయం అందుతుందని పేర్కొనడం గందరగోళానికి కారణమైంది.


తాజాగా కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకానికి సంబంధించిన గైడ్ లైన్స్‌ వివరిస్తూ ఒక జీవో జారీ చేయగా.. అందులో తల్లికి మాత్రమే ప్రభుత్వ సాయం అందిస్తామని ఉంది. దీనిపై ప్రజలు గందరగోళంలో ఉన్నప్పటికీ అటు ప్రభుత్వం కానీ, ఇటు కూటమి నాయకులు కానీ స్పందించడం లేదు. దీనిపై ప్రతిపక్ష వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

దీనిని ప్రశ్నిస్తూ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎక్స్ వేదికగా ఓ ట్వీట్ చేశారు. తల్లికి వందనం పథకం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ప్రభుత్వ సాయం అందిస్తామని ఎన్నికల ముందు చెప్పి ఇప్పుడెందుకు మోసం చేశారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనిపై తాము నిలదీస్తున్నప్పటికీ ఎవరూ ఎందుకు స్పందించడం లేదని, సమాధానం చెప్పే ధైర్యం కూడా ఎవరికీ లేదా? అని మండిపడ్డారు. కనీసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయినా స్పందించి చేసిన మోసంపై సమాధానం చెప్పాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు.

First Published:  12 July 2024 10:35 AM GMT
Next Story