Telugu Global
Andhra Pradesh

రౌడీ రాజకీయాలు వద్దు.. అభివృద్ధి రాజకీయాలు కావాలి

అనకాపల్లి జిల్లాలో వెన్నెలపాలంలో రోడ్లపై ఉన్న గుంతలు పూడ్చే కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు

రౌడీ రాజకీయాలు వద్దు.. అభివృద్ధి రాజకీయాలు కావాలి
X

రోడ్లు అనేవి నాగరికతకు చిహ్నమని.. రోడ్లు బాగుంటే పరిశ్రమలు వస్తాయని సీఎం చంద్రబాబు అన్నారు. అనకాపల్లి జిల్లాలో పర్యటించిన సీఎం వెన్నెలపాలంలో రోడ్లపై ఉన్న గుంతలు పూడ్చే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో రోడ్లు నరకానికి రహదారిగా మారాయన్నారు. రోడ్లు ఈ దుస్థితికి రావడానికి గత పాలకులే కారణమని ధ్వజమెత్తారు. గత సీఎం రోడ్లపై ఈత కొలనులు ఏర్పాటు చేశారని ఎద్దేవా చేశారు. రోడ్లు అభివృద్ధికి చిహ్నం. గుంతలు లేని రోడ్లకు వెన్నలపాలెంలో శంకుస్థాపన చేశామన్నారు. రోడ్లు బాగుంటే వ్యాపారాలు బాగా జరుగుతాయన్నారు. సంక్రాంతిలోపు రోడ్లపై ఉన్నటువంటి గుంతలన్నీ పూడ్చాలని సీఎం ఆదేశించారు. రౌడీ రాజకీయాలు వద్దు. అభివృద్ధి రాజకీయాలు కావాలన్నారు. 201419లో రోడ్లు ఎలా ఉండేవో గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 24 వేల కి.మీ సిమెంట్‌ రోడ్లు వేశామన్నారు. రోడ్లపై గుంతలు లేకుండా చూసే బాధ్యత మాది అన్నారు. రాష్ట్రంలో మళ్లీ భూతం (జగన్‌ను ఉద్దేశించి) రాకుండా చూసే బాధ్యత ప్రజలది అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అనిత, కొల్లు రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.

First Published:  2 Nov 2024 1:21 PM IST
Next Story