Telugu Global
Andhra Pradesh

కేంద్రం నుంచి అనుమతులు వచ్చాక విశాఖ మెట్రో పనులు

అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తరాల్లో సమాధానం ఇచ్చిన మంత్రి నారాయణ

కేంద్రం నుంచి అనుమతులు వచ్చాక విశాఖ మెట్రో పనులు
X

కేంద్రం నుంచి అనుమతులు రాగానే విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. రెండోరోజు ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తరాల్లో విశాఖ టీడీపీ ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుపై డీపీఆర్‌ సిద్ధం చేశామన్నారు. ఇప్పటికే దీన్ని కేంద్రానికి పంపినట్లు వెల్లడించారు. అక్కడి నుంచి అనుమతులు రాగానే పనులు ప్రారంభిస్తామని వివరించారు. మెట్రో రైలు ప్రాజెక్టును వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా పక్కన పెట్టేసిందని మంత్రి ఆరోపించారు. ఈ ప్రాజెక్టుపై స్వయంగా కేంద్రమంత్రిని కలిసినట్లు వివరించారు. సీఎం చంద్రబాబు కూడా ప్రధాని మోడీకి లేఖ రాశారని చెప్పారు. విశాఖలో మొత్తం 76.90 కిలోమీటర్ల మేర మెట్రో నిర్మాణం చేపడుతామన్నారు. రెండు ఫేజ్‌లలో 4 కారిడార్లలో నిర్మిస్తామని మంత్రి నారాయణ వివరించారు.

First Published:  13 Nov 2024 6:58 AM GMT
Next Story