అర్థం కాకపోతే నా ప్రెస్ మీట్ మళ్లీ వినండి
మీడియా అంటే తనకు గౌరవం ఉందని, తానెప్పుడూ మీడియా ప్రతినిధులను దూషించలేదని వివరణ ఇచ్చారు ఎంపీ విజయసాయిరెడ్డి.
తనపై మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఇటీవల వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రంగా ఖండించిన విషయం తెలిసిందే. అయితే ఆ ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడిన భాష సరిగా లేదంటూ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ కి అప్పటికప్పుడే విజయసాయిరెడ్డి బదులిచ్చారు కూడా. అయితే పదే పదే మీడియా ప్రతినిధులను దూషించారని సోషల్ మీడియాలో టీడీపీ నాయకులు రచ్చ చేస్తున్నారు. దీనిపై మరోసారి విజయసాయిరెడ్డి వివరణ ఇచ్చారు. తాను మీడియా ప్రతినిధులను ఎప్పుడూ దూషించలేదన్నారు.
Sri @naralokesh, నేను మీడియా ప్రతినిధులను ఎన్నడూ దూషించలేదు. మీడియా ముసుగులో మీరు పెంచి పోషిస్తున్న కుల అరాచక శక్తులు గురించి మాత్రమే మాట్లాడాను, నా మాటలను తప్పుదారి పట్టించవద్దు, అర్థం కాకపోతే నా ప్రెస్ మీట్ మళ్ళీ వినండి. మంచి, మర్యాద గురించి ఎవరికైనా అవసరమైతే నేను నేర్పిస్తాను.…
— Vijayasai Reddy V (@VSReddy_MP) July 17, 2024
మీడియా ముసుగులో..
మీడియా అంటే తనకు గౌరవం ఉందని, తానెప్పుడూ మీడియా ప్రతినిధులను దూషించలేదని వివరణ ఇచ్చారు ఎంపీ విజయసాయిరెడ్డి. "మీడియా ముసుగులో మీరు పెంచి పోషిస్తున్న కుల అరాచక శక్తుల గురించి మాత్రమే మాట్లాడాను, నా మాటలను తప్పుదారి పట్టించవద్దు, అర్థం కాకపోతే నా ప్రెస్ మీట్ మళ్ళీ వినండి. మంచి, మర్యాద గురించి ఎవరికైనా అవసరమైతే నేను నేర్పిస్తాను. మీ భాష ఏమిటో మీకు తెలియాలంటే గత ఇరవై నెలల మీ వీడియోలు మీరే చూసుకోండి. పెద్దల సభ సభ్యుడితో మాట్లాడే తీరు ఇదేనా"...? అంటూ నారా లోకేష్ ని ఉద్దేశిస్తూ ట్వీట్ వేశారు విజయసాయిరెడ్డి.
ఉద్దేశపూర్వకంగానే తనను కొంతమంది టార్గెట్ చేశారంటూ విజయసాయిరెడ్డి తన ప్రెస్ మీట్ లో ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. వారిలో ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోనని ఆయన ఘాటు హెచ్చరికలు చేశారు. పార్లమెంట్ లో ప్రివిలేజ్ కమిటీకి తాను ఫిర్యాదు చేస్తానన్నారు. నిజా నిజాలు నిర్థారణ చేసుకోకుండా, తన వివరణ తీసుకోకుండా తప్పుడు వార్తలు రాశారనేది ఎంపీ విజయసాయి ఆరోపణ.