Telugu Global
Andhra Pradesh

దమ్ముంటే సొంత పేర్లతో రండి.. విజయసాయి ఛాలెంజ్

సోషల్ మీడియాలో టీడీపీ సానుభూతిపరులు ఫేక్ అకౌంట్లతో విమర్శలు చేస్తున్నారని అన్నారు విజయసాయిరెడ్డి. రెడ్డి, యాదవ్, గౌడ్ అనే ఇంటి పేర్లను ఉపయోగించుకుంటూ ఫేక్ అకౌంట్లతో పోస్టింగ్ లు పెడుతున్నారన్నారు.

దమ్ముంటే సొంత పేర్లతో రండి.. విజయసాయి ఛాలెంజ్
X

సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లతో రెచ్చిపోయే వారికి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఓపెన్ ఛాలెంజ్ చేశారు. ఎంతకాలం పిరికి వాళ్లలా ఐడెంటిటీకి ముసుగు వేసి దాక్కుంటారని ప్రశ్నించారు. దమ్ముంటే సొంత పేర్లతో సోషల్ మీడియా ఫైట్ కి సిద్ధం కావాలని సవాల్ విసిరారు.


సోషల్ మీడియాలో టీడీపీ సానుభూతి పరులు ఫేక్ అకౌంట్లతో విమర్శలు మొదలు పెట్టారని అన్నారు విజయసాయిరెడ్డి. రెడ్డి, యాదవ్, గౌడ్ అనే ఇంటి పేర్లను ఉపయోగించుకుంటూ ఆయా కమ్యూనిటీల్లో వారు సానుభూతి పెంచుకుంటున్నారని.. వారి తరపున వైసీపీని విమర్శిస్తున్నారని చెప్పారు. ఆయా కమ్యూనిటీల్లో వైసీపీ పట్ల ద్వేషం ఉందని చెప్పే ప్రయత్నం వారు చేస్తున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియాలో ఫేక్ ఐడెంటిటీలు, ఫేక్ అకౌంట్ల వెనుక టీడీపీ సానుభూతిపరులు దాక్కోవడం సిగ్గుచేటన్నారు విజయసాయిరెడ్డి.

మాటమీద నిలబడే దమ్ము, విమర్శలను నిరూపించే ధైర్యం ఉంటే సొంత పేర్లతో సోషల్ మీడియాలో పోస్టింగ్ లు పెట్టాలని సవాల్ విసిరారు విజయసాయిరెడ్డి. అజ్ఞాతంలో పిరికివారిలా దాక్కోవద్దని హితవు పలికారు. మీ మాటమీద మీరు నిలబడలేకపోతే.. పోస్టింగ్ లు పెట్టేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలన్నారు. నిజాయితీగా ఉండాలని సూచించారు విజయసాయిరెడ్డి.

First Published:  20 Aug 2024 1:00 PM IST
Next Story