Telugu Global
Andhra Pradesh

జత్వానీ వృత్తే బ్లాక్‌మెయిల్‌.. నాకు వైసీపీతో సంబంధం లేదు - విద్యాసాగర్‌

ఎలక్షన్ ఫలితాలు వచ్చిన రోజు నుంచే పార్టీలు, రాజకీయాలు వదిలేశానన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మళ్లీ రాజకీయ పార్టీతో సంబంధాలు కొనసాగించలేదన్నారు విద్యాసాగర్.

జత్వానీ వృత్తే బ్లాక్‌మెయిల్‌.. నాకు వైసీపీతో సంబంధం లేదు - విద్యాసాగర్‌
X

ముంబై నటి జత్వానీ ఇష్యూ ఇప్పుడు ఏపీలో పొలిటికల్ కాక రేపుతున్న విషయం తెలిసిందే. ఐతే అధికార తెలుగుదేశం పార్టీ.. నటి జత్వానీ వ్యవహారాన్ని వైసీపీకి ముడిపెడుతోంది. కుక్కల విద్యాసాగర్ వైసీపీకి చెందిన నాయకుడని, ఆయనే కాదు ఇంకా పలువురు వైసీపీ నేతలు ఈ కేసులో ఉన్నారని ఆరోపిస్తుంది.

తాజాగా తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలపై కుక్కల విద్యాసాగర్‌ స్పందించారు. ఈ వివాదంపై క్లారిటీ ఇచ్చారు. తనకు వైసీపీకి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. తన తండ్రి ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌లో కృష్ణా జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌గా చేశారని, ఆ టైమ్‌లోనే తన తండ్రికి రాష్ట్రపతి అవార్డు కూడా వచ్చిందని గుర్తు చేసుకున్నారు. తర్వాత మారిన పరిస్థితుల్లో తన తండ్రి వైసీపీలో చేరారని, కానీ 2013లో ఆయన చనిపోయారని చెప్పారు విద్యాసాగర్.


ఆయన చనిపోవడంతో 2014లో తన తండ్రికి ఇవ్వాల్సిన సీటును జగన్ తనకు ఇచ్చారని గుర్తు చేసుకున్నారు విద్యాసాగర్. కానీ తాను డిసెంబర్ నుంచి మే వరకు కేవలం ఐదు నెలలు మాత్రమే వైసీపీలో ఉన్నానని చెప్పారు. ఎలక్షన్ ఫలితాలు వచ్చిన రోజు నుంచే పార్టీలు, రాజకీయాలు వదిలేశానన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మళ్లీ రాజకీయ పార్టీతో సంబంధాలు కొనసాగించలేదన్నారు విద్యాసాగర్. ఇక జత్వానీ కేసులో బాధితుడిగా వెళ్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానన్నారు. జత్వానీ చూపెడుతున్న ఫొటోలు కూడా తనవి కావన్నారు విద్యాసాగర్. జత్వానీ ఆమె తల్లితో కలిసి ఓ టీమ్‌ను పెట్టుకుని ఇలాంటి వ్యవహారాలు నడిపిస్తుందన్నారు.

First Published:  31 Aug 2024 9:05 AM IST
Next Story