Telugu Global
Andhra Pradesh

ఏపీలో వేద పండితులకు నిరుద్యోగ భృతి

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఉత్తర్వులు జారీ

ఏపీలో వేద పండితులకు నిరుద్యోగ భృతి
X

ఏపీలో కూటమి ప్రభుత్వ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మరో నిర్ణయం తీసుకున్నది. వేద పండితులకు నిరుద్యోగ భృతి చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నెలకు రూ. 3 వేల చొప్పున సంభావన రూపంలో వేద పండితులకు నిరుద్యోగ భృతి చెల్లించాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 7 దేవాలయాల పరిధిలో ఉన్న మొత్తం 600 మంది వేద పండితులకు ఈ నిరుద్యోగ భృతి వర్తించనున్నది. సింహాచలం, అన్నవరం, కనకదుర్గ, శ్రీకాలహస్తి, ద్వారకతిరుమల, శ్రీశైలం, కాణిపాకం ఆలయాల్లోని పండితులకు నిరుద్యోగ భృతి చెల్లించనున్నట్లు ప్రభుత్వం పేర్కొన్నది.మరోవైపు రాష్ట్రంలో 2024-29గానూ ఎలక్ట్రానిక్‌ మాన్యూఫాక్చరింగ్‌ పాలసీ 4.0 కి ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. 2024-29వరకు ఎలక్ట్రానిక్‌ మాన్యూఫాక్చరింగ్‌ పాలసీ అమలు చేయాలని నిర్ణయించింది. ఈ పరిశ్రమలకు అంతర్జాతీయస్థాయి మౌలిక సదుపాయాలను కల్పించనున్నారు. ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తి రంగంలో ఆధునిక సాంకేతికతో పాటు పెద్ద ఎత్తున ఉపాధి కల్పన జరగనున్నది. ఈ రంగంలోని పెట్టుబడులకు, పరిశ్రమలను ప్రోత్సహిస్తామని ప్రభుత్వం వెల్లడించింది.

First Published:  31 Oct 2024 9:20 AM IST
Next Story