Telugu Global
Andhra Pradesh

తిరుమల లడ్డూ వివాదం.. బాధ్యులపై కఠిన చర్యలు: పవన్‌

తిరుమల లడ్డూల్లో జంతువుల కొవ్వు వినియోగించంపై విమర్శలు వ్యక్తమౌతున్నాయి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు.

తిరుమల లడ్డూ వివాదం.. బాధ్యులపై కఠిన చర్యలు: పవన్‌
X

తిరుమల లడ్డూ వివాదంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన 'ఎక్స్‌'లో పోస్ట్‌ చేశారు. ఈ అంశంపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. వైసీపీ హయాంలో ఉన్న టీటీడీ బోర్డే ఈ ప్రశ్నలకు జవాబు చెప్పాలన్నారు. లడ్డూల్లో జంతువుల కొవ్వు వినియోగించడం అందరి మనోభావాలను దెబ్బతీసిందని చెప్పారు.

జంతువుల నూనెను కలపడం దుర్మార్గమైన చర్య: బండి సంజయ్‌

ఏడు కొండల స్వామి లడ్డూ తయారీలో జంతువుల నూనెను కలపడం దుర్మార్గమైన చర్య అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ అన్నారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం సమగ్రమైన దర్యాప్తు జరిపించి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు. వైసీపీ ప్రభుత్వ చర్యల వల్లనే తిరుమలలో ఇలాంటి ఇలాంటి అనర్థాలు జరిగాయని కేంద్ర మంత్రి మండిపడ్డారు.

ఇది సనాతన ధర్మంపై జరిగిన దాడి, కుట్ర:రామ జమ్మభూమి ముఖ్యపూజారి

తిరుమలలో లడ్డూ తయారీ వివాదంపై రామ జమ్మభూమి ముఖ్యపూజారి ఆచార్య సత్యేంద దాస్‌ స్పందించారు. ప్రసాదంలో చేప నూనె ఉన్నట్లు తేలింది. ఇది సనాతన ధర్మంపై జరిగిన దాడి, కుట్రగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇది చిన్న తప్పుకాదు:సినీ నటి ప్రణీత

ఇదే అంశంపై సినీ నటి ప్రణీత కూడా స్పందించారు. తిరుమల లడ్డూ వివాదంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు ఇలా జరగడం దారుణం అన్నారు. ఇది చిన్న తప్పుకాదని పోస్ట్‌ చేశారు.

First Published:  20 Sep 2024 6:41 AM GMT
Next Story