Telugu Global
Andhra Pradesh

జీబీఎస్‌ వ్యాధిపై ఆందోళన అవసరం లేదు

సచివాలయంలో ఆయన ఆరోగ్యశాఖ అధికారులతో కలిసి మీడియా సమావేశం మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ వ్యాఖ్యలు

జీబీఎస్‌ వ్యాధిపై ఆందోళన అవసరం లేదు
X

గులియన్‌ బారీ-సిండ్రోమ్‌(జీబీఎస్‌) వ్యాధిపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ అన్నారు. సచివాలయంలో ఆయన ఆరోగ్యశాఖ అధికారులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. జీబీఎస్‌ రోగులకు ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.జీబీఎస్‌ రోగులకు సరిపడా ఇమ్యూనోగ్లోబిన్‌ ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయన్నారు. చికిత్స తీసుకోకుండానే చాలావరకు వ్యాధి తగ్గిపోతుందని చెప్పారు.

రాష్ట్రంలో 43 జీబీఎస్‌ కేసులు నమోదు కాగా.. ప్రస్తుతం 17 మంది చికిత్స పొందుతున్నారు. గత ఏడాది, ఏడాది కలిపి మొత్తం రోగుల పూర్వాపరాలను పరిశీలించి.. ఈ వ్యాధి సోకడానికి కారణాలు, దారితీసే పరిస్థితులను గుర్తించాలని వైద్యశాఖ ఉన్నతాధికారులను ఆదేశించాం. ఎప్పటికప్పుడు పరిస్థితులపై సమీక్షిస్తున్నాం. రాష్ట్రంలో జీబీఎస్‌ బాధితులకు అందించడానికి సరిపడా ఇమ్యూనోగ్లోబిన్‌ ఇంజెక్షన్లు ఉన్నాయి. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ వ్యాధి సోకినా 85 శాతం చికిత్స అవసరం లేకుండా తగ్గిపోతుందన్నారు. 15 శాతం మాత్రం ఇంజెక్షన్లు ఇవ్వాల్సిన అవసరం వస్తుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంజెక్షన్లు సరఫరా చేస్తున్నాం. అనంతపురం, గుంటూరు, కడప, కాకినాడ, రాజమహేంద్రవరం, విశాఖ జీజీహెచ్‌లలో 749 ఇంజెక్షన్లు ఉన్నాయి. అదనంగా మరో 469 ఇంజెక్షన్లు ఉన్నాయి. వీటిలో 425 ఇంజెక్షన్లను లభ్యత లేని ఇతర జీజీహెచ్‌లకు తరలిస్తున్నాం. అవసరం మేరకు అదనంగా ఈ ఇంజెక్షన్లను కొనుగోలు చేస్తామన్నారు. ఈ వ్యాధిన బారిన పడిన వారికి చికిత్స అందించడానికి సిద్ధం ఉన్నామని మంత్రి సత్యకుమార్‌ వివరించారు.

First Published:  17 Feb 2025 6:17 PM IST
Next Story