Telugu Global
Andhra Pradesh

దక్షిణాది దేవాలయాలను చూసి ప్రపంచం ఆశ్చర్యపోతున్నది

తిరుపతిలో నేటి నుంచి మూడు రోజుల పాటు జరగనున్న్ ఇంటర్నేషనల్‌ టెంపుల్స్‌ కన్వెన్షన్‌ అండ్‌ ఎక్స్‌పో కార్యక్రమం

దక్షిణాది దేవాలయాలను చూసి ప్రపంచం ఆశ్చర్యపోతున్నది
X

మన దేవాలయాల చరిత్ర చాలా పురాతనమైనదని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ అన్నారు.Tirupati to Host International Temple Conventionలో పాల్గొని మాట్లాడారు.నేటి నుంచి మూడు రోజుల పాటు జరిగే ఈ ఎక్స్‌పో ప్రారంభోత్సవంలో ఏపీ సీఎం చంద్రబాబు, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌, గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌ పాల్గొన్నారు. ఈ ఎక్స్‌పోలో భాగంగా నిపుణుల మధ్య ఆలయాలపై చర్చలు, వర్క్‌షాపులు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఫడ్నవీస్ మాట్లాడుతూ.. దక్షిణభారతంలోని అందమైన దేవాలయాలు చూసి ప్రపంచం ఆశ్చర్యపోతున్నదన్నారు. ఇవాళ 55 శాతం మంది ప్రజలు ధర్మ పర్యటన చేస్తున్నారని చెప్పారు. గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌ మాట్లాడుతూ.. సనాతన ధర్మాన్ని ఆచరించడం అందరి కర్తవ్యమని చెప్పారు. హిందూ ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి ఇలాంటి సదస్సులు ఉపయోగపడుతాయన్నారు.

ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ. ... దేశాభివృద్ధిలో టెంపుల్‌ టూరిజం ప్రత్యేక పాత్ర పోషిస్తుందన్నారు. దేవాలయాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలే కాదు.. అభివృద్ధికి ప్రధాన ఆదాయ వనరులు. ప్రస్తుతం అందరూ ఆధ్యాత్మిక వైపు అడుగులు వేస్తున్నారు. ఎందరో భక్తులు రూ. కోట్ల విరాళాలు ఇస్తున్నారు. ఈ విరాళాలను పేదల శ్రేయస్సు కోసం ఖర్చు చేస్తున్నామన్నారు.

టెంపుల్‌ కనెక్ట్‌ సంస్థ ఆధ్వర్యంలో అంత్యోదయ ప్రతిష్ఠాన్‌ సహకారంతో తిరుపతిలోని ఆశ కన్వెన్షన్‌ సెంటర్‌లో అంతర్జాతీయ దేవాలయాల సమావేవం ఎక్స్‌పో కొనసాగనున్నది. మూడు రాష్ట్రాల సీఎం జ్యోతిప్రజ్వలన చేసిన ప్రారంభించిన ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి శ్రీపాద్‌ నాయక్‌, తిరుపతి జిల్లా ఇన్‌చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుతో పాటు పలువురు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కన్వెన్షన్‌కు ప్రధాని నరేంద్ర మోడీ హార్దిక శుభాకాంక్షలు తెలుపుతూ రాసిన లేఖను నిర్వాహకులు చదివి వినిపించారు. దేవాలయ నిర్వహణలో ఉత్తమ పద్ధతులను తెలియజేసే ఈ ప్రత్యేక జ్ఞాన పంచన కార్యక్రమంలో నిపుణుల నేతృత్వంలో చర్చలు, ప్రద్శనలు, వర్క్‌షాపులు, మాస్టర్‌ క్లాసులు-టెంపుల్‌ టాక్స్‌ జరగనున్నాయి.

First Published:  17 Feb 2025 7:06 PM IST
Next Story