కేంద్ర బడ్జెట్ 2025-26ను ఏపీ సీఎం చంద్రబాబు స్వాగతించారు. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయిన మధ్యతరగతి ప్రజలకు పన్ను మినహాయింపు గొప్ప పరిణామామని అన్నారు. బడ్జెట్‌లో మహిళలు, పేదలు, యువత, రైతుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చారు. రాబోయే ఐదేళ్లలో వృద్ధికి ఆరు కీలక రంగాలను గుర్తించి బడ్జెట్ రూపొందించారు. జాతీయ శ్రేయస్సు వైపునకు కీలక అడుగులను ఈ బడ్జెట్ సూచిస్తున్నది. దేశానికి సుసంపన్నమైన భవిష్యత్తుకు ఈ బడ్జెట్ బ్లూప్రింట్‌గా పనిచేస్తుంది అని చంద్రబాబు అన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు సీఎం అభినందనలు తెలిపారు.
Previous Articleఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్.. 8 మంది మావోయిస్టులు మృతి
Next Article 14ం కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలు నెరవేర్చే బడ్జెట్
Keep Reading
Add A Comment