Telugu Global
Andhra Pradesh

లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్‌ అందించిన సీఎం

నేడు ఏపీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ప్రారంభం

లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్‌ అందించిన సీఎం
X

పల్నాడు జిల్లా యల్లమందలో ఏసీ సీఎం చంద్రబాబు పర్యటించారు. లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా సీఎం వెళ్లి వారితో మాట్లాడారు. శారమ్మ అనే మహిళ ఇంటికి వెళ్లి పింఛన్‌ నగదును చంద్రబాబు అందజేశారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.ఆమె కుమార్తె కు మంచి చదువు చెప్పించాలని అధికారులను ఆదేశించారు. నీట్‌ కోచింగ్‌ ఇప్పించాలని సూచించారు. శారమ్మ కుమారుడికి ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా రూ. లక్ష రుణం ఇప్పించాలని సూచించారు. మరో లబ్ధిదారుడు ఏడు కొండలు ఇంట్లోకి వెళ్లి సీఎం పలకరించారు. వారి ఇంట్లో స్వయంగా కాఫీ కలిపి ఏడుకొండలు కుటుంబసభ్యులకు చంద్రబాబు అందించారు. వారి కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

రాష్ట్రంలో ఉదయం నుంచి ముమ్మరంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ చేస్తున్నది. 63,77,943 మందికి పింఛన్ల పంపిణీ కోసం రూ.2717 కోట్లు విడుదల చేసింది. కొత్త సంవత్సరం నేపథ్యంలో జనవరి 1కి ముందే పేదల ఇళ్లల్లో పింఛను డబ్బు ఉండాలని ఒకరోజు ముందుగానే 31వ తేదీనే ప్రభుత్వం పింఛన్లను పంపిణీ చేస్తున్నది. ఉదయం నుంచి ఇప్పటి వరకు 85 శాతం మందికి పింఛన్ల పంపిణీ పూర్తి చేసినట్లు సమామాచారం

First Published:  31 Dec 2024 12:47 PM IST
Next Story