వరుసగా ఐదో ప్రెస్ మీట్.. జగన్ పై టీడీపీ సెటైర్
పోనీ ప్రశ్నలతో చికాకు పెట్టేది ఎల్లోమీడియానే అనుకుందాం. సరైన సమాధానం చెప్పి ఆ ఎల్లోమీడియా నోరు మూయించేస్తే అది వైసీపీకి మరింత మైలేజీ తెస్తుంది కదా.
ప్రెస్ మీట్ లో మీడియా అడిగే ప్రశ్నలకు జగన్ సమాధానం చెబుతారా..?
చెబుతారో లేదో వైసీపీ నేతలకు కూడా క్లారిటీగా తెలుసు. ఆయన వెనక నిలబడ్డ వారికి మరీ బాగా తెలుసు. అందుకే ఆయన చెప్పాల్సిందేదో చెప్పిన వెంటనే మీడియా ప్రశ్నలు వినపడకుండా జై జగన్ అనే నినాదాలు మిన్నంటుతాయి. ఒకటీ రెండుసార్లు కాదు, ఇది ఐదోసారి అంటూ టీడీపీ సెటైర్లు వేస్తోంది. ఈరోజు కూడా జగన్ తన ప్రెస్ మీట్ అయిన వెంటనే ఓ నమస్కారం పెట్టి వెళ్లిపోయారు. మీడియా ప్రశ్నలు అడుగుతుండగానే ఆయన వెనుదిరిగి వెళ్లడం విశేషం.
వరుసగా అయుదవ ప్రెస్ మీట్...
— Telugu Desam Party (@JaiTDP) August 9, 2024
36 మంది పేర్లు అడిగిన మీడియా..
అదే వెకిలి నవ్వు, అదే ఐప్యాక్ స్టైల్ దండం పెట్టి, పారిపోయిన "ఫేకు జగన్" #FekuJagan#EndOfYCP#AndhraPradesh pic.twitter.com/9hmf4huotZ
సబ్జెక్ట్ పక్కదారి పట్టకుండా..
గతంలో కూడా మీడియా ప్రశ్నలకు జగన్ సమాధానాలు దాటవేసినా, సబ్జెక్ట్ పక్కదారి పట్టకూడదనే ఉద్దేశంతోనే తాను అలా చేసినట్టు చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు సబ్జెక్ట్ ఏపీలో జరుగుతున్న క్రైమ్. 36 రాజకీయ హత్యలు జరిగాయని జగన్ చెబుతున్నారు. వాటి వివరాలు ఇవ్వొచ్చు కదా అని హోం మంత్రి సహా మిగతా టీడీపీ నేతలు వెటకారం చేస్తున్నారు. మీడియా కూడా అదే ప్రశ్న అడుగుతోంది. మరి దానికి జగన్ లేదా, ఇతర వైసీపీ నేతలు సమాధానం చెప్పాలి కదా.
అధికారంలో ఉన్నప్పుడు సీఎం హోదాలో జగన్ ప్రెస్ మీట్లు పెట్టేవారు కాదనే అపవాదు ఉంది. మీడియా ముందుకు రావడం, రాకపోవడం రాజకీయ నాయకుల వ్యక్తిగతం. అధికారంలో ఉన్నప్పుడు ఇది చెల్లుబాటవుతుందేమో కానీ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మీడియా ప్రశ్నలను దాటవేస్తే అది తప్పుడు సంకేతాలను పంపినట్టే అవుతుంది. పోనీ ప్రశ్నలతో చికాకు పెట్టేది ఎల్లోమీడియానే అనుకుందాం. సరైన సమాధానం చెప్పి ఆ ఎల్లోమీడియా నోరు మూయించేస్తే అది వైసీపీకి మరింత మైలేజీ తెస్తుంది కదా. మరి జగన్ మనసులో ఏముందో తేలాలి. అప్పటి వరకూ టీడీపీకి సెటైర్లు వేసే అవకాశం చేజేతులా ఇచ్చినట్టే.