Telugu Global
Andhra Pradesh

చంద్రబాబు కేసులను సీబీఐకి బదిలీ చేయాలన్న పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు

పిటిషన్‌కు సంబంధించి ఒక్క మాట మాట్లాడినా భారీగా జరిమానా విధిస్తామని జస్టిస్‌ బేలా త్రివేది హెచ్చరిక

చంద్రబాబు కేసులను సీబీఐకి బదిలీ చేయాలన్న పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు
X

ఏపీ సీఎం చంద్రబాబుపై ఉన్న సీఐడీ కేసులను సీబీఐకి బదిలీ చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఏడు కేసులు సీబీఐకి బదిలీ చేయాలంటూ హైకోర్టు న్యాయవాది బి. బాలయ్య ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. ఇది పూర్తిస్థాయిలో తప్పుడు పిటిషన్‌ అని జస్టిస్‌ బేలా త్రివేది నేతృత్వంలోని ధర్మాసనం అసహనం వ్యక్తం చేశారు. పిటిషన్‌కు సంబంధించి ఒక్క మాట మాట్లాడినా భారీగా జరిమానా విధిస్తామని జస్టిస్‌ బేలా త్రివేది హెచ్చరించారు. బాలయ్య తరఫున వాదనలు వినిపించడానికి సీనియర్‌ న్యాయవాది మణీందర్‌సింగ్‌ సిద్ధమవగా.. ఇలాంటి పిటిషన్లను కూడా మీరు వాదిస్తారా? అని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి కేసుల్లోకూడా మీలాంటి సీనియర్లు హాజరవుతారని అసలు ఊహించలేదని వ్యాఖ్యానించింది. ఒక్క మాట కూడా మాట్లాడవద్దంటూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్‌ చేసింది.


First Published:  28 Jan 2025 12:56 PM IST
Next Story