శ్రీవారి లడ్డూ కల్తీపై సిట్ విచారణ షురూ
మూడు రోజుల పాటు తిరుపతిలోనే సిట్ టీమ్
BY Naveen Kamera28 Sept 2024 6:45 PM IST

X
Naveen Kamera Updated On: 28 Sept 2024 6:45 PM IST
తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీపై సిట్ విచారణ షురూ అయ్యింది. సిట్ చీఫ్, గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి, తిరుపతి ఏఎస్పీ వెంకట్రావు, డీఎస్పీలు సీతారామారావు, శివ నారాయణ స్వామి, సీఐలు సత్యనారాయణ, ఉమామహేశ్వర్ రావు, సూర్యనారాయణ స్వామి శనివారం తిరుమలకు చేరుకున్నారు. శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పద్మావతి అతిథి గృహంలో టీటీడీకి చెందిన పలువురు అధికారులతో సిట్ టీమ్ భేటీ అయ్యింది. ఈ సందర్భంగా వారి నుంచి పలు వివరాలు తెలుసుకున్నారు. సిట్ బృందం మూడు రోజుల పాటు తిరుపతిలోనే ఉండి విచారణ చేయనున్నారు.
Next Story