Telugu Global
Andhra Pradesh

వైసీపీకి షాక్.. మాజీ డిప్యూటీ సీఎం రాజీనామా

వైసీపీ సర్కార్‌లో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేసిన నాని.. సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్నారు. వీలైనంత వరకు వివాదాలకు దూరంగా ఉన్నారు.

వైసీపీకి షాక్.. మాజీ డిప్యూటీ సీఎం రాజీనామా
X

వైసీపీకి మరో షాక్ తగిలింది. మాజీ ఉప ముఖ్యమంత్రి, సీనియర్ నేత ఆళ్ల నాని పార్టీకి రాజీనామా చేశారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఏలూరు అసెంబ్లీ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆళ్ల నాని.. తన ప్రత్యర్థి, టీడీపీ నేత రాధాకృష్ణయ్య చేతిలో భారీ తేడాతో ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ అంటిముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు నాని.

తాజాగా ఏలూరు జిల్లా వైసీపీ అధ్యక్ష పదవితో పాటు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు నాని. వ్యక్తిగత కారణాలతోనే ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు లేఖలో పేర్కొన్నారు నాని. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ చీఫ్‌ జగన్‌కు పంపారు.

వైసీపీలోని నాని త్రయంలో ఆళ్ల నాని ఒకరు. వైసీపీ సర్కార్‌లో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేసిన నాని.. సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్నారు. వీలైనంత వరకు వివాదాలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న పరిస్థితుల నేపథ్యంలో రాజకీయాలకు దూరంగా ఉండాలని ఆయన భావిస్తున్నట్లు సన్నిహితులు చెప్పారు. ఇక ఇటీవల పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు వైసీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

First Published:  9 Aug 2024 4:16 PM IST
Next Story