Telugu Global
Andhra Pradesh

రఘురామకు అవమానం.. స్పీకర్‌కు లేఖ

అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి విజయం సాధించడంతో తనకు పెద్ద పదవి వస్తుందని భావించారు RRR. స్పీకర్‌ పదవి తనదేనని చెప్పుకున్నారు. స్పీకర్‌ పదవి లేకపోతే కేబినెట్‌లోనైనా చోటు దక్కుతుందని భావించారు.

రఘురామకు అవమానం.. స్పీకర్‌కు లేఖ
X

ఏపీ అసెంబ్లీ సమావేశాల వేళ సీనియర్ నేత, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజుకు చేదు అనుభవం ఎదురైంది. ఆయన కారును అధికారులు అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతించలేదు. దీంతో ఆయన అవమానంగా ఫీలయ్యారు. అక్కడున్న అధికారులపై మండిపడ్డారు.

మంత్రుల కాన్వాయ్‌ మాత్రమే లోపలికి అనుమితిస్తారా అంటూ అధికారులను నిలదీశారు. అసెంబ్లీ అంటేనే ఎమ్మెల్యేలందరినీ కలిపే ప్రాంతమంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు రఘురామ. ఇదే అంశంపై స్పీకర్ అయ్యన్నపాత్రుడికి లేఖ రాశారు. అసెంబ్లీలోకి తన కారును అనుమతించకపోవడంపై వివరణ కోరాలని తన లేఖలో కోరారు RRR.

ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి విజయం సాధించడంతో తనకు పెద్ద పదవి వస్తుందని భావించారు RRR. స్పీకర్‌ పదవి తనదేనని చెప్పుకున్నారు. స్పీకర్‌ పదవి లేకపోతే కేబినెట్‌లోనైనా చోటు దక్కుతుందని భావించారు. కానీ, ఆయనకు ఏ పదవి దక్కలేదు. ఎమ్మెల్యేగానే ఉండిపోయారు. నిజానికి అసెంబ్లీ ఎన్నికలకు ముందు రఘురామను చేర్చుకోవడానికి ఏ పార్టీ ఇష్ట పడలేదు. ముందుగా ఆయన బీజేపీ నుంచి నర్సాపురం ఎంపీ టికెట్ ఆశించారు. ఐతే రఘురామను చేర్చుకునేందుకు నిరాకరించిన బీజేపీ.. ఎంతో కాలంగా పార్టీకి విధేయుడుగా ఉన్న భూపతిరాజు శ్రీనివాస వర్మకు టికెట్ కేటాయించింది. అంతేకాదు కేంద్ర సహాయ మంత్రి పదవి సైతం కట్టబెట్టింది. ఇక చివరకు రఘురామకు టీడీపీ ఆశ్ర‌య‌మిచ్చింది. తర్వాత ఉండి టికెట్ కేటాయించడంతో అక్కడి నుంచి విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు.

First Published:  22 July 2024 1:53 PM IST
Next Story