Telugu Global
Andhra Pradesh

ఏపీ డిప్యూటీ పవన్‌ కళ్యాణ్‌ తో సర్పంచులు భేటీ

తమ డిమాండ్లు పరిష్కరించాలని విజ్ఞప్తి.. పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్న పవన్‌

ఏపీ డిప్యూటీ పవన్‌ కళ్యాణ్‌ తో సర్పంచులు భేటీ
X

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ తో ఏపీ పంచాయతీరాజ్‌ చాంబర్‌, సర్పంచుల సంఘం నాయకులు ఆదివారం భేటీ అయ్యారు. మంగళగిరిలోని పవన్‌ కళ్యాణ్‌ క్యాంప్‌ ఆఫీస్‌లో జరిగిన సమావేశంలో పంచాయతీరాజ్‌ చాంబర్‌ అధ్యక్షుడు వైబీ రాజేంద్ర ప్రసాద్‌, నాయకులు పాల్గొన్నారు. గ్రామ సచివాలయాలను పంచాయతీల్లో విలీనం చేయాలని, సర్పంచులు, ఎంపీటీసీల గౌరవ వేతనం రూ.3 వేల నుంచి రూ.15 వేలకు పెంచాలని, ఎంపీపీలు, జెడ్పీటీసీల వేతనం రూ.6 వేల నుంచి రూ.30 వేలకు పెంచాలని కోరారు. మైనర్‌ గ్రామ పంచాయతీల కరెంట్‌ బిల్లులు ప్రభుత్వమే చెల్లించాలని, క్లాప్‌ మిత్రలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే వేతనాలు చెల్లించాలన్నారు. సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ సభ్యులకు వారి కుటుంబంతో తిరుమలకు వెళ్తే సంవత్సరానికి ఒకసారి ప్రొటోకాల్‌ దర్శనం కల్పించాలని సహా 26 డిమాండ్లను డిప్యూటీ సీఎం ముందు పెట్టారు. సర్పంచుల డిమాండ్ల అమలు సాధ్యసాధ్యాలపై సీఎం చంద్రబాబు, అధికారులతో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తానని పవన్‌ కళ్యాణ్‌ హామీ ఇచ్చారు. ఇకపై ప్రతినెలా సర్పంచులతో సమావేశమై పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. సమావేశంలో పంచాయతీరాజ్‌ కమిషనర్‌ కృష్ణతేజ, సర్పంచుల సంఘం నాయకులు ప్రతాప్‌ రెడ్డి, ముత్యాలరావు, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.

First Published:  10 Nov 2024 7:49 AM GMT
Next Story