Telugu Global
Andhra Pradesh

శ్రీవారి లడ్డూ ప్రసాదాల నాణ్యత పునరుద్ధరణ

ఈ మేరకు కూటమి ప్రభుత్వం చేపట్టిన చర్యలను ఎక్స్‌ వేదికగా వివరించిన టీటీడీ

శ్రీవారి లడ్డూ ప్రసాదాల నాణ్యత పునరుద్ధరణ
X

నాణ్యమైన నెయ్యిని కొనుగోలు చేసి, వినియోగించడం ద్వారా లడ్డూ ప్రసాదం ప్రాశస్త్యాన్ని తిరిగి తెచ్చినట్లు ప్రజలకు టీటీడీ తెలిపింది. కూటమి ప్రభుత్వం వచ్చాక నందిని నెయ్యిని కొంటున్నట్లు వెల్లడించారు. శ్రీవారి లడ్డూ ప్రసాదాల పవిత్రత, నాణ్యతను మళ్లీ పునరుద్ధరించినట్లు టీటీడీ ఈవో తెలియజేశారు. ఈ మేరకు కూటమి ప్రభుత్వం చేపట్టిన చర్యలను ఎక్స్‌ వేదికగా వివరించింది. శ్రీవారి లడ్డూ ప్రసాదాల పవిత్రతను తిరిగి పునరుద్ధరించామని పేర్కొన్నది.

నాడు వైసీపీ ప్రభుత్వ హయాంలో గుత్తేదారు సరఫరా చేసిన నెయ్యిలో 'ఎస్‌' విలువ ఎంత ఉండాలి? ఎంత ఉన్నది? అనే విషయమై ల్యాబ్‌ నివేదికను ట్యాగ్‌ చేసింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో సేకరిస్తున్న నెయ్యిలో 'ఎస్‌' విలువ ఏ మేరకు ఉన్నదనే వివరాలను జతపరిచింది.

సీఎం చంద్రబాబును కలిసిన టీటీడీ ఈవో

టీటీడీ ఈవో శ్యామలరావు సీఎం చంద్రబాబును కలిశారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వివాదంలో ముఖ్యమంత్రికి ఆయన పూర్తిస్థాయి నివేదిక అందజేశారు. పశ్చాత్తాప పరిహారంగా చేయాల్సిన ప్రక్రియపై చర్చించారు. ఆగమ సలహా మండలి సలహాలు, సూచనలను టీటీడీ ఈవో ముఖ్యమంత్రికి వివరించారు.

First Published:  22 Sept 2024 2:36 PM IST
Next Story