Telugu Global
Andhra Pradesh

జగన్ పేరు తొలిగించినంత మాత్రాన..! కూటమికి వైసీపీ కౌంటర్

అంబేద్కర్‌ విగ్రహంపై దాడి చేసిన కూటమి నేతలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. జగన్ పేరు తొలగించినంత మాత్రాన చరిత్రను చెరిపేయలేరన్నారు నేతలు.

జగన్ పేరు తొలిగించినంత మాత్రాన..! కూటమికి వైసీపీ కౌంటర్
X

జగన్‌ పేరు తొలగింపు వివాదం ఏపీలో అగ్గి రాజేసింది. విజయవాడ స్వరాజ్య మైదానంలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ న్యాయ మహాశిల్పం పీఠంపై ఏర్పాటు చేసిన మాజీ సీఎం జగన్‌ పేరును అర్ధరాత్రి లైట్లు ఆపేసి తొలగించారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో పోలీసుల సమక్షంలోనే నగరపాలక సిబ్బంది ఈ దుశ్చర్యకు పాల్పడ్డట్టు తెలుస్తోంది. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసిన‌ జగన్ పేరు తొలగించడాన్ని వైసీపీ నేతలు తీవ్రంగా ఖండించారు.

అంబేద్కర్ మాన్యుమెంట్‌పై జగన్‌ పేరును తొలగించిన ప్రాంతానికి వెళ్లారు. మాజీమంత్రి మేరుగ నాగార్జున, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. టీడీపీ దాడులు పరాకాష్టకు చేరాయని మండిపడ్డారు. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని ఫైర్ అయ్యారు. అంబేద్కర్‌ విగ్రహంపై దాడి చేసిన కూటమి నేతలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. జగన్ పేరు తొలగించినంత మాత్రాన చరిత్రను చెరిపేయలేరన్నారు నేతలు.

సీఎం హోదాలో అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించారు జగన్. రూ. 400 కోట్లతో 125 అడుగుల విగ్రహ నిర్మాణం వైసీపీ ప్ర‌భుత్వ హ‌యాంలోనే జ‌రిగింది. స్వయంగా జగన్ ప్రారంభించిన విగ్రహంపై ఆయన పేరే లేకుండా చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి

First Published:  9 Aug 2024 2:26 PM IST
Next Story