Telugu Global
Andhra Pradesh

తిరుమల శ్రీవారి ఆర్జితా సేవా టికెట్ల విడుదల

కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ 2025 ఫిబ్రవరి నెల కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేసిన టీటీడీ

తిరుమల శ్రీవారి ఆర్జితా సేవా టికెట్ల విడుదల
X

శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ఫిబ్రవరి నెల కోటాను విడుదల చేశారు. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ 2025 ఫిబ్రవరి నెల కోటాను గురువారం టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. వర్చువల్‌ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన ఫిబ్రవరి నెల కోటాను గురువారం మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నది. అంగ ప్రదక్షిణం టోకెన్ల కోటాను నవంబర్‌ 23 న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.

శ్రీవాణి ట్రస్ట్‌ టికెట్లను నవంబర్‌ 23న ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనున్నది.

వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వీలుగా ఫిబ్రవరి నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను నవంబర్‌ 23న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్లో విడుదల చేయనున్నది.

ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను నవంబర్‌ 25న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నది.

తిరుమల, తిరుపతిలో ఫిబ్రవరి నెల రూమ్‌ల కోటాను నవంబర్‌ 25న మధ్యామ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.

https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్‌ ద్వారా శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లను బుక్‌ చేసుకోవచ్చు.

First Published:  21 Nov 2024 2:20 PM IST
Next Story