Telugu Global
Andhra Pradesh

ప్రకాశం బ్యారేజీ నుంచి శ్రీశైలం ప్రాజెక్టు సీ ప్లేన్‌

ట్రయల్‌ రన్‌ సక్సెస్‌.. రేపు ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు

ప్రకాశం బ్యారేజీ నుంచి శ్రీశైలం ప్రాజెక్టు సీ ప్లేన్‌
X

విజయవాడ నుంచి శ్రీశైలం వెళ్లాలంటే ఏం చేస్తారు? రోడ్డు మార్గంలో అయితే డైరెక్ట్‌ గా వెళ్లొచ్చు.. రైళ్లో అయితే మార్కాపురం వరకు వెళ్లి అక్కడి నుంచి రోడ్డు మార్గాన చేరుకోవచ్చు.. రెక్కలు కట్టుకొని ఎగిరిపోయే చాన్స్‌ ఉంటే ఏం చేస్తారు? శ్రీశైలం దగ్గర్లో ఎయిర్‌ పోర్టు ఎక్కడుందా అని ఆలోచిస్తున్నారా? ఎయిర్‌ పోర్టు నుంచి ఎయిర్‌ పోర్టుకు ప్రయాణించే విమానం కాదు.. నీళ్లపై తేలుతూ ఎగిరిపోయే విమానం అయితే.. ఊహించడానికే భలే గమ్ముత్తుగా ఉంది కదా..? టూరిజం ప్రమోషన్‌ లో భాగంగా విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు ''సీ ప్లేన్‌'' అందుబాటులోకి రాబోతుంది. శుక్రవారం ప్రకాశం బ్యారేజీలో టేకాఫ్‌ అయిన సీ ప్లేన్‌ శ్రీశైలం రిజర్వాయర్‌ లో విజయవంతంగా ల్యాండ్‌ అయ్యింది. సీ ప్లేన్‌ ట్రయల్‌ సక్సెస్‌ కావడంతో ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఎయిర్‌ఫోర్స్‌, టూరిజం, పోలీస్‌ డిపార్ట్‌మెంట్ల అధికారులు హర్షం వ్యక్తం చేశారు. శనివారం సీఎం చంద్రబాబు నాయుడు ఈ సీ ప్లేన్‌ ను అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ విమానం ప్రజలకు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఎంత చార్జ్‌ చేస్తారు అనే వివరాలు తెలియాల్సి ఉంది.




First Published:  8 Nov 2024 1:59 PM GMT
Next Story