Telugu Global
Andhra Pradesh

తాలూకాలు మారిపోతున్నాయి.. నెంబర్ ప్లేట్లు వచ్చేస్తున్నాయి

ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు ఆపిన యువకుడికి హెల్మెట్ లేదు, ట్రిపుల్ రైడింగ్, పైగా నెంబర్ ప్లేట్ స్థానంలో పిఠాపురం ఎమ్మెల్యేగారి తాలుకా అని రాసుంది. దీంతో పోలీసులు ఆ బండి ఆపారు.

తాలూకాలు మారిపోతున్నాయి.. నెంబర్ ప్లేట్లు వచ్చేస్తున్నాయి
X

పిఠాపురం ఎమ్మెల్యేగారి తాలూకా.. అంటూ బైక్ వెనక స్టిక్కర్ వేసుకుని తిరగడం ఇప్పుడు ట్రెండ్ గా మారింది. అయితే ఈ ట్రెండ్ కాస్త శృతి మించి నిబంధనల ఉల్లంఘన వరకు వచ్చి చేరింది. బండి ముందు లేదా వెనక మేం ఫలానా వారి తాలూకా అని స్టిక్కర్ వేసుకోవడంలో ఇబ్బంది లేదు. అయితే నెంబర్ ప్లేట్ ని తీసేసి ఆ స్థానంలో ఇలాంటి స్టిక్కర్ అంటించుకోవడం మాత్రం సరైన పద్ధతి కాదు అంటున్నారు పోలీసులు. ఆమధ్య ఓ యువకుడితో బండి స్టిక్కర్ తీసేయించి డిక్కీలో ఉన్న నెంబర్ ప్లేట్ తీసి అదే స్థానంలో పెట్టించారు. తాజాగా విజయవాడలో కూడా అలాంటి ఘటనే జరిగింది. ఇక్కడ ట్రాఫిక్ పోలీసులకు చిక్కిన యువకుడికి హెల్మెట్ లేదు, ట్రిపుల్ రైడింగ్, పైగా నెంబర్ ప్లేట్ స్థానంలో పిఠాపురం ఎమ్మెల్యేగారి తాలుకా అని రాసుంది. దీంతో పోలీసులు ఆ బండి ఆపారు.


నెంబర్ ప్లేట్ కూడా లేదు..

తాలూకా స్టిక్కర్ ప్లేట్ బండికి తగిలించాడు సరే, తీసేసిన నెంబర్ ప్లేట్ అయినా స్కూటీ డిక్కీలో ఉందా అంటే అదీ లేదు. దీంతో ఆ నెంబర్ ప్లేట్ వచ్చే వరకు బండి మా కంట్రోల్ లోనే ఉంటుందని చెప్పారు పోలీసులు. ఇక చేసేదేం లేక ఇంటి దగ్గర్నుంచి నెంబర్ ప్లేట్, హెల్మెట్ తెప్పించుకున్నాడు సదరు యువకుడు. నెంబర్ ప్లేట్ బండికి అమర్చి తీసుకెళ్లాడు.

మాదీ పిఠాపురమే..

తాలుకా ట్రెండ్ కేవలం పిఠాపురానికే పరిమితం కాలేదు, విజయవాడలో కూడా చాలామంది యువత ఇలాంటి స్టిక్కర్లతో కనపడుతున్నారు. బండి ఆపిన ట్రాఫిక్ పోలీస్ ది పిఠాపురం అట. మాదీ పిఠాపురమే, మరి మేం వేసుకున్నామా స్టిక్కర్లు అని సదరు పోలీస్ ఆ యువకుడిని ప్రశ్నించడం ఇక్కడ కొసమెరుపు.

First Published:  10 July 2024 5:34 AM GMT
Next Story