ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కేరళ పర్యటనకు వెళ్లారు. సనాతనధర్మ పరిరక్షణలో భాగంగా కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని పలు ఆలయాలను పవన్ సందర్శించనున్నారు. దీనిలోభాగంగా బుధవారం ఆయన కేరళలోని కొచ్చి సమీపంలో ఉన్న అగస్త్యమహర్షి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. పవన్ కల్యాణ్ వెంట ఆయన కుమారుడు అకీరానందన్, టీటీడీ బోర్డు సభ్యులు ఆనంద్‌సాయి ఉన్నారు. బుధవారం సాయంత్రం తిరువనంతపురంలోని పరశురామస్వామి ఆలయాన్ని పవన్ సందర్శించనున్నారు. మూడు రోజుల పర్యటనలో అనంత పద్మనాభస్వామి, మధుర మీనాక్షి, అగస్త్య జీవసమాధి, కుంభేశ్వర, స్వామిమలైయ్, తిరుత్తణి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలకు పవన్ వెళ్లనున్నారు.
Previous Articleస్థానిక సంస్థల ఎన్నికలపై నేడు కీలక సమావేశాలు
Next Article చైనా నిషేధిత యాప్‌లన్నీ మళ్లీ గూగుల్ ప్లే స్టోర్‌లో
Keep Reading
Add A Comment