ఐదేళ్లలో ఐదు లక్షల ఉద్యోగాలే మా లక్ష్యం
మూడు నెలల్లో విశాఖకు టీసీఎస్ వస్తుందన్న మంత్రి లోకేశ్
BY Raju Asari21 Nov 2024 11:55 AM IST
X
Raju Asari Updated On: 21 Nov 2024 11:55 AM IST
మూడు నెలల్లో విశాఖకు టీసీఎస్ వస్తుందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల్లో ఎమ్మెల్యేల ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. ఐదేళ్లలో 5 లక్షల ఉద్యోగాలే మా ప్రభుత్వ లక్ష్యం అన్నారు. టీడీపీ హయాంలో 2014 నుంచి 2019 మధ్యలో సుమారు 150 కంపెనీలు 50 వేల మందికి ఉద్యోగాలు కల్పించాయన్నారు.ఈ పరిశ్రమలను ఆనాడు చొరవతో తీసుకొచ్చాం. అనేక సదస్సులు ఏర్పాటు చేసి విశాఖపై దృష్టి సారించామన్నారు. ముందుచూపుతో ఆనాడు డేటా సెంటర్ పాలసీ తీసుకొచ్చి అదానీ సంస్థతో ఒప్పందం చేసుకున్నామన్నారు. భూములు కేటాయించి శంకుస్థాపనలు చేశాం. కానీ అది ఆగిపోయిందన్నారు. 2019-24 మధ్య ఒక్క కాంక్లేవ్ జరగలేదని, ఒక్క పరిశ్రమ కూడా రాలేదని నారా లోకేశ్ చెప్పారు.
Next Story