రోడ్డు పనులను పరిశీలించిన ఏపీ డిప్యూటీ సీఎం
వడిశలేరు వద్ద రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అభిమానులు మృతి చెందిన ప్రాంతాన్ని పరిశీలించిన పవన్
BY Raju Asari10 Jan 2025 1:05 PM IST
X
Raju Asari Updated On: 10 Jan 2025 1:05 PM IST
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిఠాపురం పర్యటనకు వెళ్లారు. రాజమహేంద్రవరం నుంచి పిఠాపురం వెళ్లే మార్గంలో రామస్వామిపేట వద్ద ఏడీబీ రోడ్డు పనులను ఆయన పరిశీలించారు. నిర్మాణం ఎప్పుడు ప్రారంభించారు? పనులు ఎంత వరకు పూర్తయ్యాయి? తదితర విషయాలను జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి, ఇతర అధికారులను అడిగి తెలుసుకున్నారు. రోడ్డు వెంట కాలినడకన వెళ్తూ డ్రెయిన్ సౌకర్యం, నిర్మాణ పనుల్లో నాణ్యతను పరిశీలించారు. దీంతోపాటు ఇటీవల గేమ్ ఛేంజర్ ప్రీరిలీజ్ ఈవెంట్ సమయంలో వడిశలేరు వద్ద రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అభిమానులు మృతి చెందిన ప్రాంతాన్ని పవన్ పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Next Story