Telugu Global
Andhra Pradesh

తొక్కిసలాట ఘటనపై చంద్రబాబుకు నివేదిక

తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలు, క్షతగాత్రులను ఆయన పరామర్శించనున్న ఏపీ సీఎం

తొక్కిసలాట ఘటనపై చంద్రబాబుకు నివేదిక
X

తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబకు జల్లా కలెక్టర్‌ నివేదిక సమర్పించారు. డీఎస్పీ అత్యుత్సాహం వల్ల ఒక్కసారిగా భక్తులు రావడంతో తొక్కిసలాట జరిగిందని పేర్కొన్నారు. తొక్కిసలాట జరిగినా డీఎస్పీ సరిగా స్పందించలేదు. ఎస్పీ వెంటనే సిబ్బందితో వచ్చి భక్తులకు సాయం చేశారు. అంబులెన్స్‌ వాహనాన్ని టికెట్‌ కౌంటర్‌ బైట పార్క్‌ చేసి డ్రైవర్‌ వెళ్లిపోయాడు. 20 నిమిషాల పాటు డ్రైవర్‌ అందుబాటులోకి రాలేదు. డీఎస్సీ, అంబులెన్స్‌ డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లే భక్తులు చనిపోయారని నివేదికలో వెల్లడించారు. అటు డీఎస్సీ తీరుపై ఎస్పీ సుబ్బారాయుడు, ఇతర అధికారుల నుంచి వివరాలు సేకరించి కలెక్టర్‌ ఈ నివేదిక అందించారు.

మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు అమరావతి నుంచి తిరుపతికి బయల్దేరారు. తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలు, క్షతగాత్రులను ఆయన పరామర్శించనున్నారు. తిరుపతి వెళ్లే ముందు ఉండవల్లిలోని తన నివాసంలో అధికారులతో సీఎం సమావేశం నిర్వహించారు. ఘటన అనంతర పరిణామాలు, చేపట్టిన చర్యలపై చర్చించారు. మరోవైపు తిరుపతి జిల్లా కలెక్టర్‌ పంపిన ప్రాథమిక నివేదికపైనా సమావేశంలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

First Published:  9 Jan 2025 1:08 PM IST
Next Story