దాడులన్నీ పక్కకు పోయాయి.. దువ్వాడే స్పెషల్ టాపిక్
ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రతిపక్ష వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కానీ ప్రతి సారీ ఏదో ఒక సమస్య ప్రతిపక్షాన్ని అంతకంటే తీవ్రంగా కార్నర్ చేస్తోంది.
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను వ్యవహారం పూర్తిగా ఆయన వ్యక్తిగతం కావొచ్చు. ఆనీ అది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఓవైపు విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థి బొత్స సత్యనారాయణ విజయం కోసం వరుస మీటింగ్ లు పెడుతున్నారు జగన్. మరోవైపు ఏపీలో జరుగుతున్న దాడుల్లో బాధితులుగా మిగిలినవారిని పరామర్శిస్తూ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఇంత సీరియస్ గా ఉన్న ఏపీ రాజకీయం ఎమ్మెల్సీ దువ్వాడ వ్యవహారం వల్ల ఒక్కసారిగా రచ్చరచ్చగా మారింది. ఏ న్యూస్ ఛానెల్ లోనూ నంద్యాల పరామర్శ హైలైట్ కాలేదు, సోషల్ మీడియాలో కూడా జగన్ పరామర్శ, ఆయన ప్రభుత్వానికి సంధించిన ప్రశ్నలు అంతంతమాత్రంగానే కనపడుతున్నాయి. ఇప్పుడు ఏకైక హాట్ టాపిక్ దువ్వాడ మాత్రమే.
అర్ధరాత్రి వేరే మహిళతో దొరికిన జగన్ శిష్యుడు వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను...
— Telugu Desam Party (@JaiTDP) August 10, 2024
నిలదీసిన భార్య, పిల్లల పై పచ్చి బూతులు తిడుతూ, రాడ్డు తీసుకుని చంపే ప్రయత్నం చేసిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను. అడ్డుకున్న పోలీసులు. పోలీసులు అడ్డుకోకపోతే జగన్ రెడ్డి శిష్యుడు, భార్యని, పిల్లలని… pic.twitter.com/5yqejC6HEI
ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రతిపక్ష వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కానీ ప్రతి సారీ ఏదో ఒక సమస్య ప్రతిపక్షాన్ని అంతకంటే తీవ్రంగా కార్నర్ చేస్తోంది. తాజాగా దువ్వాడ విషయంలో వైసీపీ పూర్తిగా టార్గెట్ అయింది. అటు దువ్వాడను సమర్థించలేరు, ఇటు ఆయన భార్యకు మద్దతుగా మాట్లాడలేరు. వైసీపీ నేతలు ఇరుకునపడిపోయారు. అదే సమయంలో సాక్షి మీడియా కూడా ఈ వ్యవహారంలో సతమతం అవుతోంది.
దువ్వాడ ఎపిసోడ్ బయటకు వచ్చిన తర్వాత గతంలో పవన్ కల్యాణ్ పై వైసీపీ నేతలు చేసిన వ్యక్తిగత ఆరోపణలు మరోసారి చర్చకు వస్తున్నాయి. దువ్వాడ శ్రీనివాస్ నేరుగా టీవీ చర్చల్లో.. పాతివ్రత్యం, ఏకపత్నీ వ్రతం అంటూ పెద్ద పెద్ద డైలాగులే కొట్టారు. తీరా ఇప్పుడు ఇంటికి వచ్చిన భార్యా పిల్లలపై కర్రలతో దాడికి దిగుతున్నారు. మరి దీన్ని కూడా రాజకీయ దాడిగానే వైసీపీ చూస్తుందా..? దువ్వాడ భార్య కేసు పెడితే, రేపు పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుంటే.. దాన్ని కూడా రాజకీయ ప్రతీకార చర్యేనని వైసీపీ నేతలు అనగలరా..?